రంగుల పండుగ హోలీ ఇళ్లలో సంతోషాన్ని నింపాల్సింది పోయి, ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా, కొరడీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. కేవలం సరదాగా రంగు పూయడానికి వచ్చిన నాలుగేళ్ల పసివాడిపై కన్నమ్మలా చూసుకోవాల్సిన గన్నమ్మే (అమ్మమ్మ) అత్యంత పాశవికంగా వేడి నీళ్లు పోసింది. ఈ నెల 3న జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది. పండుగ పూట ఆడుకోవాల్సిన పిల్లాడు ఇప్పుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
Read Also : US Attack : ట్రంప్ వీకెండ్ దాడుల వెనుక – మార్కెట్ వ్యూహం ?
బాధిత బాలుడిని ఓం హరీశ్ వాంగే (4) గా గుర్తించారు. హోలీ సంబరాల్లో భాగంగా తన అమ్మమ్మకు రంగు పూయాలని ఆ చిన్నారి ఉత్సాహంగా వెళ్లాడు. అయితే, ఆ సమయంలో ఏదో కారణంతో ఆగ్రహానికి గురైన ఆ మహిళ, తన మనవడు అని కూడా చూడకుండా స్టవ్ మీద ఉన్న మరుగుతున్న నీళ్లను ఆ పిల్లాడిపై కుమ్మరించింది. ఈ దాడిలో బాలుడి శరీరం 18% నుండి 20% వరకు తీవ్రంగా కాలిపోయింది. ప్రస్తుతం ఆ చిన్నారి నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. పసివాడి చర్మం కాలిపోయి పడుతున్న బాధను చూసి అక్కడి వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఈ అమానుషానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితురాలైన మహిళపై కొరడీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోపం ఎంతటిదైనా ఒక పసి ప్రాణంపై ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పండుగ వేళ అజాగ్రత్త లేదా క్షణికావేశం ఒక చిన్నారి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నిందితురాలికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :