📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Himachal Pradesh: వింత దొంగతనం.. శ్మశానంలో అస్థికల చోరీ

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని సోలన్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక విచిత్రమైన దొంగతనం స్థానికంగా కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సాధారణంగా విలువైన వస్తువులు, డబ్బు, బంగారం వంటి వాటి చోరీల గురించి వింటుంటాం. కానీ తాజాగా జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసేలా ఉంది. చంబాఘాట్ శ్మశానవాటికలోని లాకర్‌లో భద్రపరిచిన ఒక మహిళ అస్థికలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

Read Also: Chennai: AVNLలో భారీ జీతంతో కన్సల్టెంట్ ఉద్యోగాలు

పూర్తీ వివరాలు

ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు ఈ చోరీ మరింత బాధను మిగిల్చిందని వారు వాపోయారు. వివరాల్లోకి వెళితే.. (Himachal Pradesh) సోలన్ నగరంలోని 5వ వార్డుకు చెందిన ఓ మహిళ 10 రోజుల క్రితం మృతి చెందారు. అంత్యక్రియల అనంతరం ఆమె అస్థికలను కుటుంబ సభ్యులు చంబాఘాట్ శ్మశానవాటికలోని అస్థికల లాకర్‌లో భద్రపరిచారు. వాటిని హరిద్వార్ తీసుకెళ్లి గంగానదిలో నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నారు.

Himachal Pradesh: Strange theft.. Theft of ashes from a cemetery

అయితే, గురువారం ఉదయం అస్థికల కోసం శ్మశానానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. లాకర్ పగలగొట్టి ఉండటం క‌నిపించింది. అందులోని అస్థికలు ఉన్న పాత్రతో పాటు ఒక ప్లేటు, లోటా కూడా కనిపించలేదు. దీంతో మృతురాలి కుమారుడు కమల్ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. “మా అమ్మ అస్థికలను సంప్రదాయం ప్రకారం గంగానదిలో కలపాల్సి ఉంది.

కానీ, అవి చోరీకి గురవడం మాకు తీరని వేదనను మిగిల్చింది. నిందితులను కఠినంగా శిక్షించాలి” అని ఆయన కోరారు. ఈ ఘటనపై సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ స్పందించారు. “అస్థికల దొంగతనంపై ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. శ్మశానవాటిక పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం. స్థానిక సిబ్బందిని కూడా విచారిస్తున్నాం” అని ఆయన తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chambaghat Cremation Ground Himachal pradesh latest news Solan District Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.