హెచ్సీయులో దొంగలు పడ్డారు..
హైదరాబాద్ (గచ్చిబౌలి) : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు(HCU theft case) పడ్డారు. బయటి నుంచి వచ్చే ఇతర వ్యక్తులెవరికీ కనీస అనుమతి లేకుండా పటిష్ట సెక్యూరిటీ వ్యవస్థ ఉండే హెచ్సియులో చోరీ జరుగడం సంచలనంగా మారింది. వర్సిటీలోని సిఆర్ రావు ఇనిస్టిట్యూట్ విభాగంలో కిటికీ గ్రిల్స్ తొలగించిన గుర్తు తెలియని దుండగులు ఏకంగా 50 ల్యాప్టాప్లను చోరీ చేశారు.
Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ
సంబంధించిన వివరాలు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గల సిఆర్రావు ఇనిస్టిట్యూట్(C.R.Rao Institute) విభాగం క్లాస్ రూమ్లోకి ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు కిటికీ గ్రిల్స్ తొలగించి ప్రవేశించారు. క్లాస్ రూమ్లో ఉన్న 50 ల్యాప్టాప్లను దుండగులు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. సోమవారం ఉదయం తరగతి గదిలో ల్యాప్టాప్లు మాయం కావడంతో వర్సిటీ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు తరగతి గది కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం, కారు టైర్ గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వివరాల కోసం హెచ్సియులోని సిసి కెమెరాలను మొత్తం పరిశీలిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: