हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Haryana: హర్యానాలో రహస్య లేఖ కలకలం..రంగంలోకి కేంద్ర సంస్థలు

Sharanya
Haryana: హర్యానాలో రహస్య లేఖ కలకలం..రంగంలోకి కేంద్ర సంస్థలు

హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో ఓ శివాలయంలో దొరికిన రహస్య లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ లేఖలో పేర్కొన్న విషయాలు కేవలం ఊహలు కానవు, అసలు విషయమై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా పేరు రావడం కూడా ఈ కేసును మరింత సున్నితంగా మార్చింది.

ఆలయంలో లభించిన లేఖ.. పూజారి అప్రమత్తతతో బయటపడ్డ మిస్టరీ

హిస్సార్‌లోని రెడ్ స్క్వేర్ మార్కెట్ సమీపంలోని ఒక శివాలయంలో పూజారి సురేష్ ఉదయం ఆలయం తలుపులు తెరిచిన సమయంలో గోధుమ రంగులో కవరులో ఒక లేఖ కనిపించింది. ఆ లేఖలో దేశవ్యాప్తంగా 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్థాన్, దుబాయ్​కి అక్రమ రవాణా చేసినట్లు ఉంది. హిస్సార్​లోని రెడ్ స్క్వేర్ మార్కెట్​లోని శివాలయం వద్ద ఆలయ పూజారి సురేశ్​కు ఈ లెటర్ దొరికింది. ఆయన వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

లేఖలో ఉన్న పేర్లు.. నగరాల పేర్లు.. షాకింగ్‌ డిటైల్స్‌

లేఖలోని వివరాలు ప్రకారం హిస్సార్, అంబాలా, గురుగ్రామ్, సిర్సా, రేవారి, గంగానగర్, అజ్మీర్, నర్వానా సహా దేశంలోని వివిధ నగరాల నుంచి 80- 100 మందిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి దుబాయ్, పాకిస్థాన్‌కు విక్రయించినట్లు లేఖలో ఉంది. ఘటన తీవ్రతను గమనించిన పోలీసులు లేఖను సీనియర్ అధికారులకు అందించారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

2018 నుంచే ఈ చౌకబారు ముఠా కార్యకలాపాలు?

లేఖ రాసిన వ్యక్తి తన పేరు గోప్యంగా ఉంచినప్పటికీ, ఆయన అందించిన వివరాలు భయంకరంగా ఉన్నాయి. తాము 2018 నుంచి ఈ అక్రమ రవాణా ప్రారంభించామని ఫతేహాబాద్​కు చెందిన ఒక కుటుంబం తమకు సహాయం చేసేదని అందులో వెల్లడించాడు. వారు లక్ష్యాలను ఎంచుకుని ప్రేమ లేదా డబ్బు లావాదేవీల ద్వారా ప్రజలను వలలో వేసుకునేవారన్నాడు. హిస్సార్​కు చెందిన సుమిత్ గార్గ్, అంబాలా వాసి దిగ్విజయ్, నర్వానాకు చెందిన నవీన్ రోహిలా, గురుగ్రామ్‌ వాసి అమర్​నాథ్, ఎల్లనాబాద్‌కు చెందిన వినోద్ కుమార్, అమిత్ బాగ్రి, రేవారీకి చెందిన అన్షు గులాటి, గంగానగర్​కు చెందిన రోహిణి, సన్నీ, అజ్మీర్​కు చెందిన అంకిత్ శర్మ, సిర్సాకు చెందిన అనూజ్, యాజ్​పుర్​కు చెందిన నరేశ్​ను వేరే దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు.

తెలంగాణ చిరునామా కలకలం – నిజామాబాద్‌ ఎలిమెంట్‌

ఆ లెటర్​పై తెలంగాణలోని నిజామాబాద్​కు చెందిన ఆలకుంట సంపత్ చిరునామా ఉండటం కేసును మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఈ విషయంపై హర్యానా పోలీసులు ప్రత్యేకంగా తెలంగాణ పోలీసులతో సమన్వయం చేస్తూ విచారణ చేపట్టారు. ఈ చిరునామా నిజమేనా? ఆ వ్యక్తి పాత్ర ఏంటి అన్నదానిపై వివరణ కోసం పోలీసులు అడుగులు వేస్తున్నారు.

కేంద్ర సంస్థల జోక్యం – ఇంటెలిజెన్స్, RAW రంగంలోకి?

పాకిస్థాన్, దుబాయ్ వంటి ప్రదేశాలకు భారతీయుల అక్రమ రవాణా జరుగుతుందని ప్రస్తావించడం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ లేఖను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి హరియాణా పోలీసులు కేంద్ర సంస్థలను సంప్రదించారు. అదే సమయంలో లేఖలో పేర్కొన్న వ్యక్తుల అదృశ్యాన్ని ధ్రువీకరించడానికి వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు.

ఫోరెన్సిక్ దర్యాప్తు.. నిజం బయటకు రావొచ్చా?

లేఖ కవర్‌పై పేరు ఉన్న వ్యక్తిని కనుగొనడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని హిస్సార్ పోలీసు సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అతి త్వరలో నిజం అందరికీ తెలుస్తుందన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజల్లో భయాందోళన – పోలీసులు అప్రమత్తం

మానవ అక్రమ రవాణా గురించి లెటర్ వైరల్ కావడం వల్ల హిస్సార్, దాని పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. స్థానికులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు.

ఇందులో ఒకరు పాకిస్థాన్ నుంచి పారిపోయారని కూడా లేఖలో వివరించాడు. పారిపోయిన యువకుడిని పట్టుకుని చంపమని లేదా అతని కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని ఈ ముఠా నాయకురాలు బెదిరిస్తోందని అందుకే భయపడి ఈ లేఖ రాస్తున్నానని అందులో పేర్కొన్నాడు. ఈ లేఖలో హిస్సార్​కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిస్సార్ లో సుమిత్ అనే పేరు ఉన్న నాలుగైదు మంది కనిపించకుండాపోయినట్లు తేలింది. వారిలో ఎవరు అక్రమ రవాణాకు గురయ్యారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబాలను సంప్రదించారు. అలాగే అక్రమ రవాణాకు సాయం చేసిన ఫతేహాబాద్‌కు చెందిన కుటుంబం కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

Read also: Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870