हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Haryana Crime: ఉద్యోగినులకు పీరియడ్స్‌..రుజువు చూపించాలన్న పై అధికారులు

Aanusha
Latest News: Haryana Crime: ఉద్యోగినులకు పీరియడ్స్‌..రుజువు చూపించాలన్న పై అధికారులు

హర్యానా (Haryana) రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో ఉన్న ప్రముఖ మహర్షి దయానంద్ యూనివర్సిటీలో ఒక దారుణమైన, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నెలసరి (రుతుస్రావం) సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నందుకు కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్న ముగ్గురు మహిళా పారిశుద్ధ్య కార్మికులను వారి సూపర్‌వైజర్లు వేధించిన విషయం బయటపడింది.

Read Also: Sushant Singh Rajput: సుశాంత్ ని చంపేశారు: సోదరి శ్వేత

వారు చెప్పింది నమ్మకుండా, నెలసరిలో ఉన్నట్లు నిరూపించుకోవడానికి బట్టలు విప్పి, ఫోటోలు తీసి చూపించాలని బలవంతం చేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటన రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ (Maharshi Dayanand University) లో అక్టోబర్ 26న జరిగింది.

ఈ విషయం బయటపడటంతో విద్యార్థి సంఘాలు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపర్‌వైజర్లలో ఒకరిని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ కె.కె. గుప్తా ప్రకటించారు.

పూర్తీ వివరాలు

ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు.బాధితుల కథనం ప్రకారం, వినోద్, జితేంద్ర అనే ఇద్దరు సూపర్‌వైజర్లు.. మహిళా కార్మికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నెలసరి కారణంగా అనారోగ్యంగా ఉన్నామని, ఇతర సీనియర్ అధికారుల అనుమతి తీసుకున్నామని చెప్పినా వారు వినిపించుకోలేదు. అబద్ధాలు చెబుతున్నారంటూ నిందించి, నెలసరిలో ఉన్నట్లు నిరూపించుకోవడానికి బట్టలు విప్పాలని ఆదేశించారు.

Haryana Crime
Haryana Crime

మహిళా ఉద్యోగి ద్వారా వారిని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి

మరో మహిళా ఉద్యోగి ద్వారా వారిని వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, శానిటరీ ప్యాడ్ల ఫోటోలు తీయాలని ఒత్తిడి చేశారు.”నెలసరిలో ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి మీ వ్యక్తిగత భాగాల ఫోటోలు తీయండి అని వారు చెప్పారు. మేమిద్దరం నిరాకరించడంతో మమ్మల్ని దూషించి, ఉద్యోగంలోంచి తీసేస్తామని బెదిరించారు” అని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఒత్తిడి భరించలేక ఇద్దరు మహిళలు వాష్‌రూమ్‌కు వెళ్లి ఫోటోలు ఇచ్చారని, ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నిస్తే అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యామ్ సుందర్ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని వారు చెప్పారని వివరించారు.

లైంగిక వేధింపులు, మహిళల గౌరవానికి

ఈ ఘటనపై ఇద్దరు సూపర్‌వైజర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పీజీఐఎంఎస్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోషన్ లాల్ తెలిపారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద లైంగిక వేధింపులు, మహిళల గౌరవానికి భంగం కలిగించడం, క్రిమినల్ బెదిరింపులు వంటి పలు అభియోగాలతో కేసు నమోదు చేశారు.

మహిళల భద్రతకు, గౌరవానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని యూనివర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870