📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Haryana: వ్యాయామం చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన యువకుడు

Author Icon By Anusha
Updated: August 2, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవలి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగి, యువత నుండి మధ్యవయసు వరకు చాలా మంది జిమ్‌లలో వర్కౌట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యకరమైన శరీరం, మంచి ఫిట్‌నెస్ కోసం జిమ్‌ (Gym) లో కఠినమైన వ్యాయామాలు చేయడం సహజం. కానీ గత కొద్ది రోజులుగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణిస్తున్న సంఘటనలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయసు గల వారు వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న కేసులు ఎక్కువయ్యాయి.జూలై నెలలో హర్యానా (Haryana) లోని ఫరీదాబాద్ జిల్లాలో జరిగిన ఘటన అందరినీ కలచివేసింది. 35 ఏళ్ల పంకజ్ శర్మ అనే వ్యక్తి జిమ్‌లో ట్రైసెప్స్ వ్యాయామం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా నేలపై పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వారు సహాయం చేసినా, అతను లేవలేకపోయాడు.

జిమ్ సెంటర్‌లో

వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ సంఘటన రికార్డు అవ్వడంతో జిమ్‌లో సడెన్ హార్ట్ ఎటాక్‌లు ఎలా జరుగుతున్నాయో ప్రజలు ప్రత్యక్షంగా చూశారు.తాజాగా మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. పింప్రి-చించ్‌వాడ్‌లోని జిమ్ సెంటర్‌లో 37 ఏళ్ల మిలింద్ కులకర్ణి వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. అతను 6 నెలల క్రితం తన ఇంటికి సమీపంలోని జిమ్‌లో జాయిన్ అయ్యాడు. ఉద్యోగం నుంచి వీలు దొరికినప్పుడల్లా జిమ్‌కి వెళ్లి వర్కౌట్ చేసేవాడు. శుక్రవారం సాయంత్రం కూడా సాధారణంగా వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి, లేచి నిలబడలేకపోయాడు. వెంటనే జిమ్ ట్రైనర్లు, ఇతర సభ్యులు ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మిలింద్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

హార్ట్‌అటాక్ ముందు ఏవైనా లక్షణాలు కనిపిస్తాయా?

ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పడటం, తల తిరగడం, చేతులు లేదా మెడలో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు.

వ్యాయామం చేసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వార్మప్ తప్పక చేయాలి, హెల్త్ చెకప్ చేయించుకోవాలి, బరువు మించకుండా వ్యాయామం చేయాలి, తగినంత నీరు తాగాలి, శరీరానికి అలసటగా అనిపిస్తే వెంటనే ఆగాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Anil Ambani: అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ

Breaking News Faridabad gym tragedy Gym workout deaths India Heart attack during exercise latest news Maharashtra gym heart attack Milind Kulkarni death in gym Pankaj Sharma heart failure case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.