📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Harcharan Singh Bhullar: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఐపీఎస్ పై సీబీఐ కేసు నమోదు

Author Icon By Aanusha
Updated: October 16, 2025 • 11:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్ రాష్ట్రంలో సంచలనాన్ని రేపిన లంచం కేసు వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పంజాబ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి హరిచరణ్ సింగ్ భులార్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో కళ్లుచెదిరే స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.

Read Also:  Yemen: నిమిష ప్రియకేసులో తాజా అప్‌డేట్

రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన పంజాబ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నివాసంలో భారీగా డబ్బు, బంగారం బయటపడింది. రూ.8 లక్షల లంచం డిమాండ్‌ చేసి భులార్ అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా రూ. 5 కోట్ల నగదు, విలాసవంతమైన కార్లు, నగలు, ఖరీదైన వాచీలు వంటి భారీ అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.

ఈ కేసులో భులార్‌తో పాటు, మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన హరిచరణ్ సింగ్ (Harcharan Singh Bhullar) 2009 బ్యాచ్ అధికారి. ఒక వ్యాపారవేత్తపై నమోదైన క్రిమినల్ కేసును మాఫీ చేయడానికి మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుని,

Harcharan Singh Bhullar

మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ వ్యాపారిపై

నెలవారీగా మామూళ్లు డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐ (CBI) ఆరోపించింది. పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్‌కు చెందిన పాత సామాన్లు డీలర్ ఆకాష్ బట్టా ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయ్యింది. తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి, రూ.8 లక్షలు వసూలుచేసిన భులార్.. ఆ తర్వాత నెల నెల తనకు కొంత నగదు ఇవ్వాలని బెదిరించినట్టు ఆరోపించారు.

CBI ఎఫ్ఐఆర్ ప్రకారం.. లంచం సొమ్ము తన సహచరుడు కృష్ణ ద్వారా అందజేయాలని భులార్ డిమాండ్ చేశాడు. దీంతో మధ్యవర్తిగా వ్యవహరించిన కృష్ణ వ్యాపారిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ‘ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు మామూళ్లు ఇవ్వలేదు’ మధ్యవర్తి మాట్లాడిన ఆడియో క్లిప్ ఉందని సీబీఐ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Breaking News Harcharan Singh Bhullar latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.