ఇటీవలకాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరిని అదుపుచేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదు. ఎంతో కష్టపడి, పొదుపు చేసుకున్న సొమ్మును క్షణాల్లో మాయం చేస్తారు. మన డేటాను కూడా క్షణాల్లోనే వారి అధీనంలోకి వెళ్లిపోతాయి. తాజాగా బ్రిటన్లో (Britain) హ్యాకర్ల (Hackers)దెబ్బలకు ఏకంగా ఓ కంపెనీయే మూతపడింది. దీంతో ఈ కంపెనీ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. 158 సంవత్సరాలుగా కొనసాగుతున్న కంపెనీ హ్యాకర్లు దెబ్బకొట్టారు.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
యూకేలోని కేఎన్పీ లాజిస్టిక్స్ (KNP Logistics) అనే కంపెనీ గత 158 ఏళ్ల నుంచి రవాణారంగంలో వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థకు దాదాపు 500 లారీలు ఉన్నాయి. వీటిని ‘ది నైట్స్ ఆఫ్ ఓల్డ్’ అనే బ్రాండ్ కింద నడుపుతోంది. సంస్థకు సంబంధించిన అని నియమాలను కచ్చితంగా పాటిస్తుంది. అంతేకాదు సైబర్ అటాక్ బీమా కూడా తీసుకుంది.
అయినా హ్యాకర్ల దాడికి గురైంది..
ఆకిర గ్యాంగ్ హ్యాకర్త రాన్సమ్వర్ సైబర్ అటాక్కు గురైంది. ఈ ముఠా కేఎన్పీ సిస్టమ్స్ లోని అనధికారికంగా ప్రవేశించింది. అక్కడ ఆ కంపెనీ డేటాను ఎన్క్రిప్ట్ ఫార్మాట్లోకి మార్చింది. ఉద్యోగులకు రాని యాక్సెస్ లేకుండా చేసింది. మళ్లీ తిరిగి డేటాను పొందాలంటే కొంత మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. దాదాపు 58కోట్లు అడిగినట్లుగా సమాచారం.
సొమ్ము చెల్లించలేక కంపెనీ మూత
కేఎన్పీ అంత సొమ్ము చెల్లించలేని స్థితిలో ఉండటంతో డేటా మొత్తం కోల్పోయింది. చివరికీ కంపెనీ పూర్తిగా మూతబడింది. గతంలో కూడా యూకేకు చెందిన కోఆప్, హోరోడ్స్, ఎం అండ్ ఎస్ కూడా ఇలాంటి సైబర్ దాడులకే గురయ్యాయి. కేఎన్పీ కంపెనీకి జరిగిన ఘటనపై నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సీఈవో రిచర్డ్ హోర్నే స్పందించారు. మన వ్యాపారాలు సురక్షితంగా ఉండాలంటే సిస్టమ్స్ ను మరింత సురక్షితంగా మార్చే ఆర్గనైజేషన్లు కావాలన్నారు. అలాగే కంపెనీలో ఉద్యోగుల లాగిన్ పాస్వర్డ్ ద్వారానే హ్యాకర్లు (Hackers) సిస్టమ్స్ లోకి ప్రవేశించారని కేఎన్ పీ డైరెక్టర్ పౌల్ అబాట్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Buddhism: ప్రపంచాన్ని ఊపేస్తున్న బౌద్ధసన్యాసుల లైంగిక సంబంధాలు