📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Guntur crime: గుంటూరులో లిక్విడ్ గంజాయి ముఠా అరెస్ట్

Author Icon By Rajitha
Updated: March 16, 2026 • 11:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు : గుంటూరు జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల కార్యకలాపాలకు పాల్పడే ముఠాల పై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఉక్కుపాదం మోపారు. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వస్త్ర నగర్ ఖాళీ స్థలంలో లిక్విడ్ గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వ హించారు. ఈ సందర్భంగా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒకలీటర్ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే గుంటూరు నగరానికి చెందిన షేక్ మహబూబ్ భాషా గంజాయికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలని అరకు వెళ్లి కొండలరావు, ఓ మైనర్ వద్ద నుండి లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడ కొనుగోలు చేసిన లిక్విడ్ గంజాయిని గుంటూరుకు తీసుకొని వచ్చి అతను త్రాగుతూ, కొంత అమ్ముకునేవాడు.

Read also: Mancherial crime: కుక్కల పై విష ప్రయోగం.. 100 శునకాలు మృతి

Guntur Crime: Liquid Ganja Gang Arrested in Guntur

అరకు నుండి అక్రమ సరఫరా

ఈ క్రమంలో గుంటూరుకు చెందిన షేక్ మహబూబ్ భాషా, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన తామిలి కొండల రావు, మరో మైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఈస్ట్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గంజాయి మహమ్మారిని కూకటివేళ్ళతో పెకలించి, నిర్మూలించడానికి పటిష్ట ప్రణాళికలు రూపొందించామని, పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించామని అన్నారు. ఈగల్ టీంతో సమన్వయం చేసుకుంటూ గంజాయి విక్రయం, వినియోగం, సరఫరా చేసే వారి పై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తరచుగా గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడం నూతన ఎన్ డి పి ఎస్ చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు సిఐ వెంకట ప్రసాద్, సిబ్బంది మోహన్, నూరుద్దీన్, రామరావులను గుంటూరు జిల్లా ఎస్పి అభినందించినారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh drug trafficking Guntur news latest news Liquid Ganja Seized Police Raid Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.