📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Guntur crime: మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

Author Icon By Tejaswini Y
Updated: January 22, 2026 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు జిల్లా(Guntur crime) దుగ్గిరాల మండలం చిలువూరులో భార్య–ప్రియుడి కలిసి భర్తను హత్య(Murder Case) చేసి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండగా, ఆయనకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read also: TG: మెదక్ జిల్లాలో దారుణం.. తల్లిని చంపిన కొడుకు

అక్రమ సంబంధం నేపథ్యంగా భర్త హత్య

విజయవాడలో సినిమా థియేటర్ టికెట్ కౌంటర్‌లో పనిచేసే సమయంలో లక్ష్మీమాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త చేస్తున్న ఉల్లిపాయల వ్యాపారం తనకు ఇష్టం లేదని భావించిన లక్ష్మీమాధురి, ఆయనను ఉద్యోగం మానిపించి హైదరాబాద్‌కు పంపించింది. ఈ సమయంలో ఆమె ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. కొంతకాలానికి హైదరాబాద్‌లో ఉండలేక శివనాగరాజు తిరిగి చిలువూరుకు వచ్చి మళ్లీ వ్యాపారం ప్రారంభించాడు. ఇంటివద్దే ఉండటం వల్ల లక్ష్మీమాధురి–గోపిల మధ్య అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

Guntur crime

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపిన భార్య

భర్త అడ్డు తప్పించుకోవాలని భావించిన లక్ష్మీమాధురి ఈ నెల 18న రాత్రి బిర్యానీ వండింది. అందులో నిద్రమాత్రలు కలిపి శివనాగరాజుకు పెట్టింది. అతడు గాఢ నిద్రలోకి వెళ్లాక అర్థరాత్రి సమయంలో ప్రియుడు గోపిని పిలిపించింది. ఇద్దరూ కలిసి శివనాగరాజును ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

గుండెనొప్పి అంటూ నాటకం

తర్వాత తెల్లవారుజామున గుండెనొప్పితో భర్త మృతి చెందినట్లు చుట్టుపక్కల వారికి చెప్పింది. అయితే గతంలో జరిగిన కుటుంబ వివాదాలు, ఆమె అక్రమ సంబంధంపై ఉన్న అనుమానాల నేపథ్యంలో ఇరుగుపొరుగువారు అప్రమత్తమయ్యారు. మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించడంతో నాగరాజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోస్టుమార్టం నివేదికలో ఛాతీ వద్ద ఎముకలు విరిగినట్లు, ఊపిరాడక మరణం జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు లక్ష్మీమాధురిని విచారించగా నేరం అంగీకరించింది. అనంతరం ఆమెతో పాటు ప్రియుడు గోపిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

andhra pradesh crime Chiluvuru Murder Case Extramarital affair Guntur District Crime Wife Husband Murder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.