📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: ఎఫ్‌ఐఆర్ నమోదు

Author Icon By Shobha Rani
Updated: May 19, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నగరంలోని పాలబస్తీ గుల్జార్ హౌస్‌ అగ్ని ప్రమాదంపై (Gulzar House Fire Incident) విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాద ఘటనపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు అయ్యింది. మృతుల కుటుంబ సభ్యుడు ఉత్కర్ష్ మోదీ (Utkarsh modi) ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న గుల్జార్ హౌస్‌లో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఫిర్యాదులో నిన్న (ఆదివారం) ఏం జరిగిందో ఉత్కర్ష్ మోదీ (Utkarsh modi)వివరించారు. నిన్న ఉదయం 6:10 నిమిషాలకు తన తండ్రి వినోద్ మోదీకి అత్యవసరంగా రావాలని రాహుల్ ఫోన్ చేసినట్లు తెలిపారు. కాల్ అందుకున్న వెంటనే తాము తన తండ్రితో కలిసి గుల్జార్ హౌస్ చేరుకున్నామన్నారు.

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: ఎఫ్‌ఐఆర్ నమోదు

బ్లాస్టులు, పొగ వల్ల విపరీత ప్రభావం
కానీ అప్పటికే భవనం గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్‌లలో మంటలు వ్యాపించాయని చెప్పారు. అక్కడ ఉన్నవారు, అగ్నిమాక శాఖ, డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం వేరియస్‌ హాస్పిటల్స్‌కు తరలించినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదం ఘటనపై అనుమానాలు ఉండటంతో క్షుణ్ణంగా విచారణ జరపాలని చార్మినార్ పోలీసులకు ఉత్కర్ష్ మోడీ (Utkarsh modi) ఫిర్యాదు చేశారు. కాగా.. నిన్న (ఆదివారం ) ఉదయం పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబసభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా గుల్జార్ హౌస్‌లో నివాసముంటున్నారు. నిన్న అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 21 మంది కుటుంబసభ్యులు ఆ ఇంట్లో ఉన్నారు. అత్తాపూర్‌లో ఓ వేడుకకు హాజరై వచ్చిన వీరంతా ఇంట్లోనే నిద్రించారు. అదే సమయంలో తెల్లవారుజామున బిల్డింగ్ గ్రౌండ్‌‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు అంతకంతకూ పెరగడంతో ఇంట్లో ఉన్న నాలుగు ఏసీ కంప్రెజర్‌లో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. వెంటనే మేల్కొన్న కుటుంబసభ్యులు బయటకు వచ్చే ప్రయత్నం చేయగా.. ప్రధాన మార్గంలో మంటలతో మూసుకుపోవడంతో వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
దర్యాప్తు కేంద్రీకరణ
ప్రమాదానికి కారణమైన శ్రద్ధాహీనత, భద్రతా లోపాలు, విద్యుత్ వైర్లు, గ్యాస్ లీకేజ్ వంటి అంశాలపై దర్యాప్తు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బిల్డింగ్ సేఫ్టీ ఆడిట్‌లు చేపట్టే అవకాశం. పైకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మంటలు వ్యాపించాయి. ఓ వైపు మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో వారంతా కూడా పొగను పీల్చి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటికే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానికంగా ఉండే వ్యక్తులు వెనక నుంచి హోల్ చేసి లోపలికి వెళ్లి అపస్మారస్థితిలోకి వెళ్లిని వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. అయితే దట్టమైన పొగ పీల్చడంతో 21 మందిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన నలుగురు చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బందితో పాటు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నగరవ్యాప్తంగా ప్రజలు ఈ ప్రమాదంపై ఘనమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆత్మీయ సానుభూతి, సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Read Also: Maharashtra: మహారాష్ట్రలో అగ్నిప్రమాదం 8 మంది మృతి

Breaking News in Telugu FIR registered Google news Google News in Telugu Gulzar House Fire Incident: Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.