📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Mahesh Kalawadia: విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాతీ దర్శకుడు

Author Icon By Shobha Rani
Updated: June 21, 2025 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన గుజరాతీ ఫిల్మ్ డైరెక్టర్ మహేశ్ కలావాడియా (Mahesh Kalawadia) మరణించాడని తాజాగా వైద్యులు ధ్రువీకరించారు. మహేశ్ కుటుంబ సభ్యుల డీఎన్ఏతో ఓ మృతదేహం డీఎన్ఏ సరిపోలడంతో మహేశ్ (Mahesh Kalawadia) మృతిని నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తర్వాత మహేశ్ కనిపించకుండా పోవడం, ప్రమాద స్థలంలో మహేశ్ స్కూటర్, మొబైల్ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. విమాన ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ నమూనాలు సేకరించగా.. మహేశ్ కుటుంబం కూడా శాంపుల్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే..
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో 241 మంది, నేలపై ఉన్న 29 మంది సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలానికి సమీపంలోని షాహీబాగ్‌లో కాలిపోయిన స్థితిలో ఒక యాక్టివా స్కూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో అది నరోడా నివాసి అయిన మహేశ్ జిరావాలాకు చెందినదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆయన మొబైల్ ఫోన్ చివరిసారిగా క్రాష్ సైట్ సమీపంలోనే పనిచేసినట్లు ట్రేస్ అవ్వడంతో, ఆయన కూడా ప్రమాదంలో చిక్కుకొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కుటుంబ సభ్యుల ఆశ – చివరికి బాధాకరంగా ముగిసిన ఆశ
మొదట్లో, ఈ ఆధారాలు లభించినప్పటికీ, మహేశ్ జిరావాలా కుటుంబ సభ్యులు ఈ వార్తను నమ్మలేదు. ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశతో ఎదురుచూశారు. అయితే, పోలీసులు అందించిన ఫోరెన్సిక్ నివేదికలు, ముఖ్యంగా మృతుడి డీఎన్ఏతో మహేశ్ (Mahesh Kalawadia) డీఎన్ఏ సరిపోలడం, ఆయన స్కూటర్ ఛాసిస్ నంబర్ నిర్ధారణ

Mahesh Kalawadia: విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాతీ దర్శకుడు

కావడంతో, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంతో వాస్తవాన్ని అంగీకరించారు. అనంతరం, వారు మహేశ్ మృతదేహాన్ని స్వీకరించారు. ప్రమాదం జరిగిన రోజు మధ్యాహ్నం లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలిసేందుకు మహేశ్ వెళ్లారని ఆయన భార్య హేతల్ తెలిపారు. మహేశ్ జిరావాలా పలు మ్యూజిక్ ఆల్బమ్‌లకు దర్శకత్వం వహించారు.
మ్యూజిక్ ఆల్బమ్‌లకు దర్శకుడిగా గుర్తింపు పొందిన మహేశ్
మహేశ్ కలావాడియా (Mahesh Kalawadia)గుజరాతీ సంగీత పరిశ్రమలో పలు మ్యూజిక్ ఆల్బమ్‌లకు దర్శకత్వం వహించారు. ఆయనకు సృజనాత్మక దృక్పథం, ప్రజలతో అనుబంధం ఉన్న దర్శకుడిగా గుర్తింపు ఉంది. డీఎన్ఏ సరిపోలిన తర్వాత మహేశ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వీకరించారు. ఆయనకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Read Also: Tanu: గొయ్యి తవ్వి కోడలిని పూడ్చి పెట్టి.. ఆపై లేచిపోయిందని ప్రచారం..

AhmedabadPlaneCrash Breaking News in Telugu dies in plane crash Google news Google News in Telugu Gujarati director Latest News in Telugu MissingToMartyr Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.