📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Gujarat: ప్రాణాలు తీసిన బ్లాంకెట్

Author Icon By Tejaswini Y
Updated: November 7, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జవాన్ ను చంపిన కోచ్ అటెండెంట్

సెలవుల కోసం ఇంటికి వస్తున్న ఒక సైనికుడు రైలు ప్రయాణంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. బ్లాంకెట్‌, బెడ్‌షీట్‌ కోసం జరిగిన చిన్న వాగ్వాదం చివరికి ఘోర విషాదానికి దారితీసింది. ఈ ఘటన జమ్మూ–గుజరాత్‌ (Gujarat)మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది.

సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న దుర్ఘటన

గుజరాత్‌లోని(Gujarat) సబర్మతికి చెందిన ఆర్మీ జవాన్‌ జిగార్‌ చౌధురి ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 2న కొద్దిరోజుల సెలవుల కోసం ఫిరోజ్‌పూర్‌ స్టేషన్‌ నుండి జమ్ముతావి–సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎక్కారు. స్లీపర్‌ కోచ్‌లో ప్రయాణిస్తుండగా, బీ4 ఏసీ కోచ్‌ అటెండెంట్‌ వద్ద బ్లాంకెట్‌, బెడ్‌షీట్‌ ఇవ్వమని కోరారు. అయితే, నిబంధనల ప్రకారం స్లీపర్‌ కోచ్‌ ప్రయాణికులకు ఈ సదుపాయం ఉండదని అటెండెంట్‌ చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమై, అది క్రమంగా ఘర్షణగా మారింది.

Read Also: Poverty: జీవిత పాఠాలను నేర్పుతున్న పేదరికం

దాడి సమయంలో కోచ్‌ అటెండెంట్‌ జుబైర్‌ మిమన్‌ తన వద్ద ఉన్న కత్తితో జిగార్‌ చౌధురిపై దాడి చేశాడు. దాంతో ఆర్మీ జవాన్‌ అక్కడికక్కడే మరణించాడు. రైలు బికనీర్‌ స్టేషన్‌కు చేరుకున్న వెంటనే టీటీఈ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రైల్వే పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో జుబైర్‌ను కాంట్రాక్టర్‌ ద్వారా తాత్కాలికంగా నియమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

రైల్వే శాఖపై కమిషన్‌ నోటీసులు

ఈ సంఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌(National Human Rights Commission) స్పందించింది. సహ్యద్రి రైట్స్‌ ఫోరమ్‌ అనే ఎన్జీఓ చేసిన ఫిర్యాదుపై కమిషన్‌ రైల్వే బోర్డ్‌ ఛైర్మన్‌, ఆర్పీఎఫ్‌ డీజీలకు నోటీసులు జారీ చేసింది. కదులుతున్న రైలులో సైనికుడి హత్య తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది.

కమిషన్‌ నిష్పాక్షిక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించింది. అదేవిధంగా, నిందితుడి నియామక ప్రక్రియ, అర్హతలు, శిక్షణ, పోలీసు వెరిఫికేషన్‌ వంటి పత్రాలను సమర్పించాలని రైల్వే అధికారులను కోరింది. రెండు వారాల్లోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రైల్వే బోర్డు, ఆర్పీఎఫ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

ArmyJawaanDeath HumanRightsCommission IndianArmy IndianRailways RailwayCrime SabarmatiExpress Telugu News online Telugu News Today TrainIncident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.