📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి..

Telugu News: Gujarat Crime: మరో నిర్భయలాంటి దారుణం: ఆరేళ్ల బాలికపై అమానుష దాడి

Author Icon By Pooja
Updated: December 10, 2025 • 10:51 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌ రాష్ట్రం( Gujarat Crime) రాజ్‌కోట్ జిల్లా అత్కోట్ ప్రాంతంలో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆరేళ్ల బాలికను అపహరించి దారుణంగా దాడి చేసిన సంఘటన నిర్భయ కేసును గుర్తు చేసింది. తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని రాజ్‌కోట్‌లోని ఆసుపత్రిలో చికిత్స కోసం చేరవేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Read Also: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి

Gujarat Crime: Another Nirbhaya-like atrocity: Inhuman attack on a six-year-old girl

దర్యాప్తు సమయంలో దాదాపు 100 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. చివరకు మధ్యప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల రామ్‌సింగ్ తెర్సింగ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడు అత్కోట్ ప్రాంతంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలానికి సమీపంలోని పొలాల్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఘటన వివరాలు ప్రకారం, డహోద్ జిల్లాకు( Gujarat Crime) చెందిన ఒక కూలీ కుటుంబం అత్కోట్ సమీపంలోని పొలాల్లో పని చేస్తుంది. డిసెంబర్ 4న వారి ఆరేళ్ల కుమార్తె బయట ఆడుకుంటుండగా, ఓ వ్యక్తి ఆమెను తీసుకెళ్లి హింసించాడు. చిన్నారి కేకలు వినిపించడంతో నిందితుడు అక్కడ్నుంచి పారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు వెతికే క్రమంలో బాలిక పొలంలో గాయాలతో కుప్పకూలిన స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు పది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం చిన్నారికి అనుమానితులను చూపించగా, ఆమె రామ్‌సింగ్‌ను గుర్తించడంతో కేసు మరింత స్పష్టమైంది. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను(Nirbhaya incident) గుర్తుకు తెచ్చే ఈ సంఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారి ఆరోగ్యం పై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Assault on minor girl Atkot incident Google News in Telugu Latest News in Telugu Rajkot attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.