📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Gujarat Crime: అన్నను చంపిన 15 ఏళ్ల బాలుడు.. ఆపై గర్భవతి వదినపై హత్యాచారం

Author Icon By Anusha
Updated: November 2, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 15 ఏళ్ల చిన్న వయసులోనే ఓ బాలుడు ఇంత క్రూరత్వానికి పాల్పడటం అందరినీ షాక్‌కు గురి చేసింది. అన్నను కిరాతకంగా చంపాడు. ఆరు నెలల గర్భంతో ఉన్న వదినపై అత్యాచారం చేశాడు. వద్దూ అని వేడుకుంటున్నా.. ఆమెను పాశవికంగా హత్య చేశాడు .

Read Also: Jaipur Crime:పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థిని మృతి – అనుమానాస్పద ఘటనపై దర్యాప్తు

గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన శుక్రవారం (అక్టోబర్ 31) వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జునాగఢ్ (Junagadh) నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న మారు మూల గ్రామంలో ఈ ఘటన జరిగింది. మైనర్ బాలుడి కుటుంబం దాదాపు 40 సంవత్సరాల క్రితం.. బీహార్ నుంచి ఈ గ్రామానికి వలస వచ్చింది.

గ్రామ శివార్లలోని ఆలయంలో పూజారిగా పనిచేసిన నిందితుడి తండ్రి.. కొవిడ్ సమయంలో చనిపోయాడు. నిందితుడు వీధి ఆవుల కోసం ఒక చిన్న షెడ్ నిర్వహిస్తున్నాడు. అతని అన్నయ్య ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవాడు. అతడికి పెళ్లైంది. భార్య ఆరు నెలల గర్భవతి.గర్భవతి అయిన మహిళకు బిహార్‌లో తన బంధువులు.. దీపావళి సందర్భంగా కాల్ చేశారు.

పూర్తీ వివరాలు

కాల్ కలవలేదు. అనంతరం ఆమె భర్తకు కాల్ చేస్తే కూడా.. సమాధానం రాలేదు. అనంతరం బాలుడికి చేస్తే ఏవేవో సమాధానాలు చెప్పాడు. అతడి తల్లితో మాట్లాడితే.. ఆమె తన పెద్ద కుమారుడు, కోడలు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పింది. ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వమంటే.. సమాధానం దాటవేసింది.

Gujarat Crime

అనుమానంతో వారు బిహార్ (Bihar) నుంచి గుజరాత్‌కు వెళ్లారు. యాక్సిడెంట్ గురించి పోలీసులను కనుక్కుంటే.. అలాంటిదేదీ జరగలేదని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.తల్లీకొడుకుల వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో.. వారిపై పోలీసులు నిఘా పెట్టారు.

అన్నావదినలను చంపడానికి గల కారణమేంటి?

దీంతో లభించిన సమాచారంతో వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిచి.. తమదైన శైలిలో ఇద్దరినీ వేర్వేరుగా విచారించారు. చివరికి బాలుడు మృతదేహాలను ఎక్కడ పాతిపెట్టాడో చెప్పాడు. అక్టోబర్ 16న పోలీసులు బాలుడు చెప్పిన చోట తవ్వి.. మృతదేహాలను బయటకు తీశారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడిని తన అన్న తరచూ కొట్టేవాడు.

ఆవుల షెడ్డు ద్వారా సంపాదించిన డబ్బును లాక్కునేవాడు. దీంతో అన్నపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల.. ఇంట్లోనే అన్నపై ఇనుప పైప్‌తో దాడి చేశాడు. కింద పడిపోయే దాకా తలపై బాదాడు. వదిన ఎంత వేడుకుంటున్నా.. కనికరం లేకుండా అన్నను కొట్టి చంపాడు.

వదినపై అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు

అనంతరం గర్భవతి అయిన వదినను.. తనతో శృంగారం చేయాలని అన్నాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అరుస్తుందేమోనని భయపడి.. వదిన పొట్టపై మోకాళ్లు పెట్టి గొంతు నులిమి చంపేశాడు.ఇంటి వెనుక మృతదేహాలను పాతిపెట్టడానికి బాలుడికి అతడి తల్లి సహాయం చేసింది. బట్టలు కాల్చేసి.. నగ్నంగా మృతదేహాలను పాతిపెట్టారు.

అతడి అన్న తల పగిలినట్లు, సగం పెరిగిన పిండం.. మహిళ గర్భంలోంచి బయటకు వచ్చినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది. వదినపై అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా, దీన్ని తేల్చేందుకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

brother killed Gujarat crime latest news minor boy murder pregnant woman rape Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.