📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Latest News: NEET Student: నీట్‌లో మంచి ర్యాంక్‌..డాక్టర్ కావాలని లేదని స్టూడెంట్‌ ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 6:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతీ విద్యార్థి జీవితంలో పరీక్షలు, అంచనాలు, ఫలితాలు ఒక పెద్ద ఇంపాక్ట్ కలిగిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ ఫలితాల పట్ల తీవ్రమైన భావోద్వేగాలు విద్యార్థుల మనసులో భయంకరమైన మార్పులు తీసుకురావడం చూస్తాం. తాజాగా జరిగిన ఒక ఘటన చాలా హృదయాన్ని నొప్పిచ్చే విధంగా ఉంది. ఈ కథలోని విద్యార్థి చిన్నతనం నుండి తన పాఠశాల, కోర్సులు అన్నింటిలోనూ టాపర్‌గా నిలిచేవాడు. ఎప్పుడూ మంచి మార్కులు, ర్యాంకులు సాధించేవాడు..

తమ కొడుకు మంచిగా చదువుకొని, మంచి ఉద్యోగం చేస్తూ, మంచి లైఫ్‌ లీడ్‌ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు కలలు కంటారు. తాము ఫుల్‌ఫిల్‌ చేయలేని డ్రీమ్స్‌ను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని మరికొందరు అనుకుంటారు. ఇందులో భాగంగానే చాలా మంది తల్లిదండ్రులు తమకు నచ్చిన ప్రోఫెషన్‌ను పిల్లలను ఎంచుకోమని చెప్తారు.

మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు

కానీ కొన్ని సందర్భాల్లో పిల్లలు వాటిని చదవడం ఇష్టం లేక తల్లిదండ్రులకు ఎదురుచెప్పలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్ర (Maharashtra) లో వెలుగు చూసింది. తన డాక్టర్ చదవడం ఇష్టం లేదని ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర లోని చంద్రపూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంధి.

NEET Student

వివరాల్లోకి వెళ్తే.. చంద్రపూర్‌ జిల్లాకు చెందిన 19 ఏళ్ల అనురాగ్‌ అనిల్‌ బోర్కర్‌ (Anurag Anil Borkar) అనే విద్యార్థి ఇటీవలే ఇంర్మీడియట్‌ పూర్తిచేసి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎంబీబీఎస్‌ చదివేందుకు సీట్‌ కోసం నీట్‌ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో అనిల్‌ ఓబీసీ కేటగిరీలో ఆలిండియా 1475 ర్యాంక్‌ సాధించాడు. దీంతో అతనికి ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌లో ఉన్న ఓ మెడికల్‌ కాలేజీలో సీటు వచ్చింది.

అడ్మిషన్‌ డేట్‌ కూడా రావడంతో బయల్దేరేందుకు సిద్ధమయ్యారు

దీంతో అనిల్‌ను కాలేజ్‌ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తుకున్నారు. అడ్మిషన్‌ డేట్‌ (Admission date) కూడా రావడంతో బయల్దేరేందుకు సిద్ధమయ్యారు.కానీ ఇంతలోనే వారి ఇంట్లో పెను విషాదం వెలుగు చూసింది. కరెక్ట్‌గా కాలేజ్‌లో జాయిన్‌ అవ్వాల్సిన రోజే అనురాగ్‌ ఇంట్లో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయిన ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అతని చేసితో ఒక లెటర్‌ను గమనించారు. అందులో ఇలా రాసి ఉంది.. నేను డాక్టర్‌ కావాలనుకోవడం లేదని అనురాగ్‌ రాసి చివరి అక్షరాలు కనిపించాయి. అది ఆ తల్లిదండ్రులను మరింత శోకానికి గురిచేసింది. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

academic pressure Breaking News college admission stress latest news mental health in students NEET exam Student suicide Telugu News top rank student death tragic student incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.