హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ (GHMC) పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారం జరిగింది. ఎర్రగడ్డ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై చెత్తను ఊడుస్తూ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. నిందితుడు రాజు అనే వ్యక్తి మద్యం మత్తులో ఉండి, బాధితురాలిని బలవంతంగా లైంగిక దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన నిన్న తెల్లవారుజామున జరిగినప్పటికీ ఈ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Tirumala Laddu: వైవి చుట్టూనే కల్తీనెయ్యి కేసు!
ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ (GHMC) పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వహిస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీరోజు లాగే బాధితురాలు తన విధులను నిర్వహించేందుకు ఎర్రగడ్డకు వెళ్లింది.
కేటాయించిన పని స్థలంలో విధులు నిర్వహిస్తుండగా
తనకు కేటాయించిన పని స్థలంలో విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేశాడు.ఎర్రగడ్డ(hyderabad-erragadda) ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై చెత్తను ఊడుస్తుండగా అక్కడే మాటేసిన రాజు అనే వ్యక్తి కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ దారుణ ఘటనపై బాధిత మహిళ బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి ఉన్న రాజు ఆ మత్తులో పారిశుధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు మోడల్ కాలనీలో ఓ అపార్టెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: