📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest Telugu News: Punjab: మంటలకు దగ్ధమైన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ బోగీ

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్ (Punjab)లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఫతేగఢ్ సాహిబ్ జిల్లా సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో నంబర్ 12204 అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌(garib rath express train)లో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. ఓ ఏసీ కోచ్ మొత్తం భస్మీపటలం అయింది. ప్రయాణికులు సకాలంలో మంటలను గుర్తించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికురాలు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

Read Also: Trump: భారత్ రష్యా నుంచి తక్కువ చమురు కొనుగోలు చేస్తుంది: ట్రంప్

అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగిన వైనం

ఈ ఘటన ఈ ఉదయం 7.22 నిమిషాలకు చోటు చేసుకుంది. గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ సిర్హింద్ స్టేషన్ మీదుగా వెళ్తుండగా జీ-19 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ రైలుకు సిర్హింద్‌లో హాల్ట్ సౌకర్యం లేదు. ఈ రైలు తరువాతి హాల్ట్ స్టేషన్.. అంబాలా కంటోన్మెంట్‌. సిర్హింద్ స్టేషన్ దాటుకున్న కొద్దిసేపటికే ఈ ఏసీ కోచ్ మంటల బారినపడింది. తొలుత దట్టమైన పొగ వెలువడింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. చైన్ లాగి రైలును ఆపేశారు. కిందికి దిగారు.

Punjab: మంటలకు దగ్ధమైన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ బోగీ

ఏసీ కోచ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు!

ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలికి స్వల్పంగా కాలిన గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను ఫతేగఢ్ సాహిబ్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని జీఆర్పీ అధికారులు తెలిపారు. ఏసీ కోచ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఫతేగఢ్ సాహిబ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్ లాల్ తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేపట్టామని అన్నారు. పేలుడు లేదా మండే స్వభావం ఉన్న వస్తువులు కోచ్ లో తరలిస్తోన్నట్లు ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. మంటలు అదుపు చేయడంలో భాగంగా అగ్ని ప్రమాదానికి గురైన కోచ్‌తో పాటు మరో మూడు బోగీలను రైలు నుండి వేరు చేశారు. ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగి ప్రయాణికులను ఇతర కోచ్‌లకు తరలించారు. మంటలను ఆర్పివేశారు.

గరీబ్ రథ్ రైలు ప్రత్యేకత ఏమిటి?
లక్నోలో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం విఫలమైంది...
గరీబ్ రథ్ స్పెషల్ రైలు అనేది భారతీయ రైల్వేలు నిర్వహించే సరసమైన, సూపర్‌ఫాస్ట్, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు, ఇది ఇతర రైళ్ల కంటే ఎక్కువ AC కోచ్‌లను అందిస్తుంది మరియు ఎక్కువ మంది ప్రయాణికులకు సరిపోయేలా మరింత కాంపాక్ట్ బెర్త్‌లను ఉపయోగిస్తుంది.
గరీబ్ రథ్ మంచి రైలునా?
ఏ రైలు మంచిది, గరీబ్ రథ్ లేదా రాజధాని ఎక్స్‌ప్రెస్? తనిఖీ చేయండి ...
సరసమైన, ఎయిర్ కండిషన్డ్ ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణీకులకు గరీబ్ రథ్ మంచి రైలు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Gareeb Rath Express fire Gareeb Rath latest news Indian Railways accident Latest News Breaking News railway safety India Telugu News train coach fire incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.