📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Ganesh Chavan case : కోటి బీమా కోసం హత్య.. మెసేజ్‌లతో బయటపడ్డ నేరం…

Author Icon By Sai Kiran
Updated: December 16, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ganesh Chavan case : కోటి రూపాయల జీవిత బీమా డబ్బు కోసం ఒక వ్యక్తి చేసిన దారుణం మహారాష్ట్రలో కలకలం రేపింది. తాను చనిపోయినట్టు నమ్మించేందుకు అమాయకుడైన ఒక హిచ్‌హైకర్‌ను సజీవ దహనం చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కుటుంబ సభ్యులు అతడు మరణించాడని శోకసంద్రంలో ఉండగా, ప్రియురాలికి పంపిన కొన్ని మెసేజ్‌లు అతడి ప్లాన్‌ను పూర్తిగా భగ్నం చేశాయి.

లాతూర్ జిల్లా ఔసా తాలూకాలో ఆదివారం తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన ఓ కారులో మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ కారు గణేశ్ చవాన్ అనే బ్యాంక్ రికవరీ ఏజెంట్‌కు చెందినదిగా గుర్తించారు. చవాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కారులో ఉన్న మృతదేహం అతడిదేనని పోలీసులు మొదట భావించారు.

Andhra Pradesh weather : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ అనుమానాలు మొదలయ్యాయి. గణేశ్ చవాన్ వ్యక్తిగత జీవితం గురించి విచారణ చేయగా, అతడికి (Ganesh Chavan case) ఓ మహిళతో సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఆమెను ప్రశ్నించగా, గణేశ్ చవాన్ మరో మొబైల్ నంబర్ నుంచి తనకు మెసేజ్‌లు పంపుతున్నాడని వెల్లడించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఆ నంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు సింధుదుర్గ్ జిల్లా విజయదుర్గ్ ప్రాంతంలో గణేశ్ చవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ఇంటి లోన్ తీర్చేందుకు కోటి రూపాయల బీమా డబ్బు పొందాలనే ఉద్దేశంతో ఈ పథకం రచించినట్టు చెప్పాడు.

శనివారం గోవింద్ యాదవ్ అనే వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి, మద్యం మత్తులో ఉన్న అతడిని కారులో డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి సజీవ దహనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహం తనదేనని నమ్మించేందుకు తన బ్రాస్‌లెట్‌ను అక్కడే వదిలేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని లాతూర్ ఎస్పీ అమోల్ తాంబే వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Breaking News in Telugu burned car murder case Crime News India fake death insurance scam Ganesh Chavan case Google News in Telugu hitchhiker murder India insurance murder case insurance scam murder Latest News in Telugu life insurance fraud Maharashtra crime news Maharashtra shocking crime Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.