Food Poisoning: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత గ్రామంలోనే విద్యార్థుల ఆరోగ్యంతో సిబ్బంది చెలగాటం ఆడారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి భోజనం వికటించి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి చికెన్ తిన్న 390 మంది విద్యార్థులలో, కొందరికి భోజనం చేసిన కాసేపటికే వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి.
Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి
సిబ్బంది గోప్యత.. పరిస్థితి విషమం
ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించడం గమనార్హం. విద్యార్థులకు వసతి గృహంలోనే ప్రాథమిక చికిత్స అందించి సరిపెట్టారు. అయితే, ఇద్దరి పరిస్థితి విషమించడంతో వెంటనే వారిని సత్తుపల్లిలోని డేకేర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పాఠశాల వద్దకు వెళ్లగా, లోపలికి అనుమతించకుండా సిబ్బంది అడ్డుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :