📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య.. ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు బాలుడు ఆత్మహత్య..

Ajit Pawar: 5 సార్లు పేలుళ్ల శబ్ధాలు..ప్రత్యక్ష సాక్షి

Author Icon By Vanipushpa
Updated: January 28, 2026 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే రన్​వేకు 100 అడుగుల దూరంలోనే విమానం కూలిపోయిందని ప్రత్యక్షులు చెబుతున్నారు. అలాగే విమానంలో ఉన్న వాళ్లని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిమని, కానీ మంటలు చెలరేగడంతో విఫలమైందని తెలిపారు. విమానం కిందకు దిగుతున్నప్పుడు నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ‘నేను నా కళ్లతో చూశా. నిజంగా చాలా బాధాకరం. విమానం ల్యాండ్​ అవుతున్నప్పుడు కూలిపోతుందేమో అనిపించింది. అలాగే జరిగింది. ఆ తర్వాత భారీగా పేలుడు సంభవించింది. మేం అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి చూశాం. విమానం మంటల్లో కాలిపోతుంది. మళ్లీ 4 నుంచి 5 సార్లు పేలుళ్లు సంభవించాయి. మరికొంత మంది ఇక్కడికి వచ్చారు. విమానంలో ఉన్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ పెద్ద మంటలు కావడంతో, ప్రజలు సహాయం చేయలేకపోయారు. అజిత్ పవార్ (Ajit Pawar) విమానంలో ఉన్నారు.

Read Also: Ajit Pawar Death: డిప్యూటీ సీఎం తో సహా ఆరుగురు దుర్మరణం

Ajit Pawar: 5 సార్లు పేలుళ్ల శబ్ధాలు..ప్రత్యక్ష సాక్షి

విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు

మరోవైపు విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో బారామతి విమానాశ్రయానికి కొంత దూరంలో ఉదయం 8:46 గంటలకు విమానం కూలినట్లు కనిపిస్తోంది. వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇదిలా టేబుల్ ​టాప్​ రన్​వేపై ఈ ఘటన జరిగిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా రన్​వే స్టార్టింగ్​ పాయింట్​లో కుప్పకూలిందని పేర్కొన్నారు. ఈ రన్​వేలు టేబుల్‌ ఉపరితలం మాదిరిగానే ఉంటుంది. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి రన్​వేను ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ విమానాలు ల్యాండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Blast Investigation breaking news incident Emergency Response explosion sounds reported eyewitness account blasts five explosions heard public panic Security Alert Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.