📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Dhondiram Bhosale: నీట్ లో ర్యాంక్ రాలేదని.. కుమార్తెను హత్య చేసిన తండ్రి

Author Icon By Shobha Rani
Updated: June 23, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET)లో తక్కువ మార్కులు తెచ్చుకుందనే కోపంతో ఓ తండ్రి తన కూతురిని చితకబాదాడు. కర్రతో దాడి చేయగా కూతురు రక్తపుమడుగులో కుప్పకూలింది. అయినప్పటికీ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా యోగా డే కార్యక్రమానికి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆ బాలిక చనిపోయింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతురాలి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితుడు ఓ స్కూలుకు ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తుండడం గమనార్హం.
తక్కువ ర్యాంక్ వచ్చిందని క్రూరంగా దాడి
వివరాల్లోకి వెళితే.. సాంగ్లీ జిల్లాకు చెందిన ధోండిరామ్ భోసలే ఒక పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. ధోండిరామ్(Dhondiram Bhosale) కూతురు 12వ తరగతి పూర్తిచేసింది. ఇటీవల నీట్ (NEET) పరీక్ష రాసింది. అయితే, తక్కువ మార్కులు స్కోర్ చేయడంతో ఆమెకు సీటు రాలేదు. దీంతో ధోండిరామ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

Dhondiram Bhosale: నీట్ లో ర్యాంక్ రాలేదని..కుమార్తెను హత్య చేసిన తండ్రి

కూతురును కర్రతో దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా, అతను తన పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ధోండిరామ్ భోసలేను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తండ్రిపై కేసు నమోదు, అరెస్ట్
ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ధోండిరామ్ భోసలే(Dhondiram Bhosale)ను అరెస్ట్ చేశారు. అతనిపై IPC సెక్షన్లతో పాటు, బాలల హక్కులను ఉల్లంఘించినందుకు సంబంధిత చట్టాలు ప్రయోగించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
సామాజిక స్థాయిలో తీవ్ర ఆవేదన
ఈ ఘటన పిల్లలపై అకారణ ఒత్తిడి, తల్లిదండ్రుల తీరుపై తీవ్ర చర్చలకు దారితీసింది. శారీరక, మానసిక శిక్షలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. NEET ఫలితాల తర్వాత ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also: Russia: కైవ్‌పై రష్యా దాడి..ఐదుగురు మృతి

Breaking News in Telugu EndExamPressure Father kills daughter Google news JusticeForNEETStudent Latest News in Telugu MentalHealthMatters NEET2025 over NEET rank failure Paper Telugu News StopParentalAbuse Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.