మచిలీపట్నం(Machilipatnam) నుండి ధర్మవరం(Dharmavaram) వెళుతున్న ఎస్ప్రెస్ రైల్లో(Express General) జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహిస్తున్న నకిలీ టీటీఈ అదే రైల్లో తనికీలు నిర్వహిస్తున్న గుంటూరుకి చెందిన అసలు టిటీఈ జాన్ వెస్లీకి తారసపడ్డ నకిలీ టీటీఈగా గుర్తింపు కార్డు చూపాలని నకిలీ టీటీఈని ప్రశ్నించిన జాన్ వెస్లీ విధుల్లో ఉన్న జాన్ వెస్లీతో వాదనకు దిగిన నకిలీ టీటీఈ రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారైయ్యేందుకు ప్రయత్నం, నరసరావుపేటలో నకిలీ టీటీఈని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నకిలీ టీటీఈ
ప్రస్తుతం నరసరావుపేట రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నకిలీ టీటీఈ కొన్ని రోజులుగా టీటీఈగా చెలామణి అవుతూ రైళ్లలో తిరుగుతున్న నిందితుడు. అవినాష్ కృష్ణ గుప్తా అనే వ్యక్తి నకిలీ టీటీఈగా అవతారం ఎత్తాడని నిర్దారణకు వచ్చిన రైల్వే పోలీసులు. అవినాష్ కృష్ణ గుప్తా గతంలో బిలాస్ పూర్ పరిధిలో రైల్వే గార్డుగా పనిచేసి ప్రమాదం బారిన పడటంతో ఉద్యోగం నుండి రిటైర్డ్ అయ్యాడని గుర్తింపు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Telangana: తొక్కిసలాట జరగకుండా తెలంగాణ పోలీసుల వినూత్న ఆలోచన