📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Delhi ED Raid: ఓ ఇంటిపై ఈడి దాడి.. కోట్లాది రూపాయలు స్వాధీనం

Author Icon By Rajitha
Updated: January 1, 2026 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డబ్బు ఎంత సంపాదించినా చనిపోయినప్పుడు ఏదీ మనతో రాదు. న్యాయంగా, కష్టంతో సంపాదించేది మాత్రమే మనం ఆనందంగా అనుభవించగలం.అంతేకాదు అక్రమ సంపాద మనకు ఉరిగా మారుతుంది. అన్యాయంతో సంపాదించిన డబ్బు శాపంగా మారి, మన వినాశనానికే దారితీస్తుంది.బతికేందుకు డబ్బు అవసరమే కానీ బతుకే డబ్బు సంపాదన కారాదు. ఓ వ్యక్తి సరిగ్గా తన జీవితంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అదిసక్రమమా, అక్రమమా అనేది పక్కనపెట్టి అందినకాడికి దోచుకుంటూ, అన్యాయంగా కోట్లాది రూపాయలను సంపాదించాడు. తన లగ్జరీ లైఫ్ పై సోషల్మీడియాలో తెగ పోస్టుచేస్తూ, మురిసిపోయేవాడు. చివరికి ఆ వీడియోలే ఇడి అధికారుల దృష్టిని ఆకర్షించి, చివరికి దాడులకు పాల్పడేలా చేసింది.

Read also: Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

ED Raid

సూట్ కేసు నిండా ఉన్న కోట్ల విలువైన బంగారం, వజ్రాలు చూసి షాకయ్యారు

పలు ప్రాంతాల్లో సోదాలు..ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. కుప్పలుగా ఉన్న కోట్లాది డబ్బు, సూట్ కేసు నిండా ఉన్న కోట్ల విలువైన బంగారం, వజ్రాలు చూసి షాకయ్యారు. వీటితో పాటు బ్యాగు నిండా ఉన్న రూ. 35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు, బ్యాంకుల చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు.లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్ లతో తన సంపన్న జీవనశైలిని సోషల్ మీడియాలో ప్రదర్శించే రావు ఇంద్రజీత్ సింగ్ యాదవ్ పై ఈడీ, హర్యానా పోలీసులు నిఘాపెట్టారు. ఆయన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్, రోహ్ తక్ లోని పలు ప్రాంతాల్లో సోదా చేస్తున్నారు.బెడ్ కింద కుప్పలుగా డబ్బు, బంగారంరావు ఇంద్రజీత్ యాదవ్ సహచరుడైన అమన్ కుమార్ కు చెందిన ఢిల్లీలోని సర్వప్రియ విహార్ లో ఉన్న ఇంటిపై ఈడీ అధికారులు రైడ్ చేశారు.

వజ్రాలతో కూడిన నగలను గుర్తించారు

బెడ్ కిందకుప్పలుగా ఉన్న డబ్బు, నగలు చూసి షాక్ అయ్యారు. బ్యాంకు అధికారులను రప్పించారు. కౌంటింగ్ మెషిన్లతో ఆ డబ్బును లెక్కించగా రూ. 5 కోట్లుగాతేలింది. ఒక సూట్ కేస్ నిండా ఉన్న రూ. 8.8కోట్ల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన నగలను గుర్తించారు. డబ్బు, నగలతో పాటు రూ.35 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, చెక్ బుక్ లున్న బ్యాగ్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా జెమ్ రికార్డ్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్యజమాని అయిన రావు ఇంద్రజీత్ సింగ్ యాదవ్ పై హత్య, దోపిడీ, మోసం, అక్రమ భూ కబ్జాలు, హింసాత్మక నేరాలు, ఆయుధాల చట్లంతో సహా పలుకేలుసు నమోదయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ED raid news illegal wealth case latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.