బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ నిషేధిత బెటింగ్ యాప్‌లకు సంబంధించిన కేసు. గతంలో ఈడీ సోనూ సూద్ (Sonu Sood) కి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. సోనూ ఇటీవల పంజాబ్‌లో విరామం తీసుకుని వరద బాధితులకు సహాయం చేస్తూ ఆయన ప్రజాసేవా కార్యక్రమాల్లో (public service programs) పాల్గొన్న తర్వాత, ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.
ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఈడీ విచారించింది
విచారణలో భాగంగా.. బెట్టింగ్ యాప్ (Betting app) ల ప్రచారం వాటితో సోనూ సూద్‌కి ఉన్న సంబంధాలు ప్రచారానికి తీసుకున్న డబ్బుల గురించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ, క్రీడా ప్రముఖులను ఈడీ (ED) విచారించింది. ఇటీవల సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, నటి మంచు లక్ష్మి, నటుడు విజయ్ దేవరకొండ, రానా కూడా విచారణకు హాజరయ్యారు. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం, నల్లధనం లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పలువురు సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: