బెట్టింగ్ యాప్‌లకు(ED Action) ప్రమోషన్ కల్పించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో పలువురు ప్రముఖుల ఆస్తులను అధికారులు జప్తు చేశారు. వీరిలో క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటులు సోనూ సూద్, నేహా శర్మ, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రాలు ఉన్నారు. ఈ పరిణామం కేసులో మరింత లోతుగా దర్యాప్తునకు దారితీసే అవకాశం ఉంది.
Read also: Special Guest: బిగ్‌బాస్ సీజన్ 9 ఫినాలే గెస్ట్‌గా ప్రభాస్?
బెట్టింగ్ కేసులో సెలబ్రిటీల ఆస్తులను ED జప్తు చేసింది
ఈ జాబితాలో నటి నేహా శర్మ, (ED Action) మోడల్ ఊర్వశీ రౌతేలా తల్లి, బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రాల ఆస్తులు కూడా ఉన్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో యువరాజ్ సింగ్‌కు చెందిన రూ.2.5 కోట్లు, సోనూ సూద్‌కు చెందిన రూ.1 కోటి, మిమీ చక్రవర్తికి చెందిన రూ.59 లక్షలు, నేహా శర్మకు చెందిన రూ.1.26 కోట్లు, రాబిన్ ఊతప్పకు చెందిన రూ.8.26 లక్షలు, ఊర్వశీ రౌతేలా తల్లికి చెందిన రూ.2.02 కోట్ల ఆస్తులు ఉన్నాయి.విదేశాల్లో రిజిస్టర్ అయిన ‘1xbet’ అనే అక్రమ బెట్టింగ్ యాప్ ద్వారా రూ.1000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో గతంలోనే ఈ సెలబ్రిటీలందరినీ ఈడీ విచారించింది. వారి ఆస్తులను ‘అక్రమ సంపాదన’గా (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్) పరిగణించి తాజా చర్యలు తీసుకుంది. ఇదే కేసులో గతంలో మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: