హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మళ్లీ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఈగల్ (Eagle Team) టీమ్ నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ మొత్తంలో నిషేధిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Mowgli Movie: ఓటీటీలోకి ‘మోగ్లీ’ ఎప్పుడంటే?
మాసబ్ ట్యాంక్‌లో ఈగల్ టీమ్ దాడులు..
ఈ దాడుల్లో కొకైన్, MDMA వంటి ఖరీదైన డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, లావాదేవీల వివరాల ఆధారంగా రెగ్యులర్ కస్టమర్ల జాబితాను పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఆ జాబితాలో అమన్ ప్రీత్ సింగ్ పేరు ఉండటంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే అమన్ ప్రీత్ సింగ్ పరారైనట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు(Eagle Team) గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించడమే లక్ష్యంగా పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, లావాదేవీలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: