📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Drugs: డ్రగ్స్ ఓవర్ డోస్ తో యువకుడు మృతి.. హైదరాబాద్ లో ముఠా గుట్టురట్టు

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కఠిన చర్యలకు పూనుకుంటున్నది. పోలీసులు దీనిపై ఎంత నిఘాపెట్టి, అదుపు చేసేందుకు యత్నిస్తున్నా నగరంలో విచ్చలవిడి డ్రగ్స్ సరఫరాను అదుపు చేయలేకపోతున్నారు. నిఘా కన్నులను కప్పి, చాపకింద నీరులా డ్రగ్స్ నగరంలో ప్రవహిస్తూనే ఉంది. తాజాగా రాజేంద్రనగర్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు బెంగళూరు(Bangalore) నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో యువకులు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతో బెంగళూరు నుంచి బస్సులో డ్రగ్స్(Drugs) తీసుకొని హైదరాబాద్ వస్తున్న నలుగురు యువకులను ఎస్ ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డ్రగ్ సప్లైయర్ సంగడి సంతోష్ తో పాటు గాంధీ సందీప్ కండేపల్లి, శివ పలక, సాయిబాబులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురు నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read also: ఘోరం.. బాలికపై లైంగిక దాడి

Drugs: డ్రగ్స్ ఓవర్ డోస్ తో యువకుడు మృతి.. హైదరాబాద్ లో ముఠా గుట్టురట్టు

ఓవర్ డోస్ తో యువకుడు మృతి

యువత డ్రగ్స్కు బానిసలవుతున్నారు. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ఈజీగా లభ్యం అవుతుండటంతో యువత డ్రగ్స్న తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేకమంది డ్రగ్స్ భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా డ్రగ్స్ తీసుకుని ఓ వ్యక్తి మరణించడం సంచలనంగా మారింది. డ్రగ్స్ ఓవర్ డోస్ తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజేంద్రనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ డ్రగ్స్కు బానిసయ్యాడు. డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలో నిన్న(Drugs) ఒక అపార్ట్మెంట్ లో అలీ డ్రగ్స్ సేవించాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ గా తీసుకోవడంతో అలీ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు అలీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి దగ్గర తీసుకున్నాడు? అలీకి డ్రగ్స్న ఎవరు విక్రయించారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు యువకులు, ఇద్దకు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

addiction ali Arrest Crime Drugs DrugSupply hyderabad IndiaNews Latest News in Telugu MDMA Overdose Police Rajendranagar Telangana Telugu News Youth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.