Drugs case: టిడిపి అధిష్టానానికి ఎంపి పుట్టా సంజాయిషీ

Read Time:  1 min
Drugs case: టిడిపి అధిష్టానానికి ఎంపి పుట్టా సంజాయిషీ
FONT SIZE
GET APP

Drugs case: టీడీపీ అధిష్టానం ఇచ్చిన సంజాయిషీ లేఖకు ఎంపీ పుట్టా సతీష్ వివరణ ఇచ్చినట్లు కీలక సమాచారం. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను టీడీపీ హైకమాండ్ ఎంపీ మహేశ్ కుమార్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఎంపీ, తన వివరణను ఒక సీల్డ్ కవర్లో పార్టీ కార్యాలయానికి పంపారు. ఈ లేఖను అందుకున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు కి పంపించారు.

Read Also : Air India, AI 185: 8 గంటల గాలిలో ప్రయాణం.. చివరకు ఢిల్లీలోనే ల్యాండింగ్

Drugs case: MP Putta Sanjayishi to TDP leadership
Drugs case: MP Putta Sanjayishi to TDP leadership

ప్రస్తుతం ఈ లేఖలో ఎంపీ ఏం వివరణ ఇచ్చారనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు సమాచారం రావడంతో ఈగల్ బృందం రంగంలోకి దిగింది. పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్తో పాటు పలువురికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పట్టుబడిన వ్యవహరంపై చంద్రబాబు మొదటి నుంచి సీరియస్ గా ఉన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ఎంపీ పేరును ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.