Driver Subrahmanyam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ కేసులో విచారణ జరుపుతున్న సిట్ (SIT), అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై ఛార్జిషీట్ దాఖలు చేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ అనంతబాబు శాసనమండలి నుంచి ఎవరికీ చెప్పకుండా అర్ధంతరంగా వెళ్లిపోయారు.
Read Also: Telangana: విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ఇంజినీర్ల సస్పెన్షన్
సిట్ విచారణలో కీలక అంశాలు
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యలో అనంతబాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మీదుర్గకు కూడా ప్రమేయం ఉందని సిట్ నిర్ధారించింది. ఆమె హత్యకు ప్రేరేపించడమే కాకుండా, నేరంలో భర్తకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, తన గన్‌మెన్లు మరియు వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యల కోసం వేగంగా పావులు కదుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: