📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Crime: పిచ్చోడితో వైద్యురాలి ప్రేమపెళ్లి.. ఆపై వేధింపులు తాళలేక ఆత్మహత్య

Author Icon By Sharanya
Updated: August 7, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కయ్యానికైనా వియ్యానికైనా సరిసమానంగా ఉండాలని పెద్దలు అంటారు. ఈ సామెత ఊరకే రాలేదు. పెళ్లి చేసుకోవాలనుకున్నా ఈడుజోడీ బాగుండడం మాత్రమే కాదు, అన్నివిధాలా సరిపోయారా లేదా అని చూసుకుని చేసుకోకపోతే ఆ నష్టం భారీగానే ఉంటుంది. ఎంతలా అంటే ప్రాణం తీసుకునేంత నష్టం జరుగుతుంది. ఇంతకీ ఎందుకు ఇదంతా చెబుతున్నారని అనుకుంటున్నారా? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆ వివరాలు ఏమిటో మీరే చదివేయండి..

Crime


అతడొక మానసిక రోగి, ఆమె సైకాలజిస్ట్ వైద్యురాలు (Psychologist doctor). చికిత్స సమయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. ఆ వైద్యురాలు మానసిక రోగితో తన వైవాహిక అనుబంధం ఎలా ఉంటుందో ఏమాత్రం ఆలోచించకుండా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లాడింది. చివరికి అతడి వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.

ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్లో (SR Nagar) రజిత(33) సైకాలజీ వైద్యురాలు. ఆమె ఇంటర్న్షిప్లో
భాగంగా బంజారాహిల్స్ లోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న కేపీహెచ్బీకి చెందిన రోగి ఆగు రోహిత్ (33) పరిచయమయ్యాడు.

ప్రేమిస్తున్నట్లు నటించి, పెళ్లాడాడు..

తాను సాఫ్ట్వేర్ ఇంజినీరనని రజితను నమ్మబలికాడు. రోహిత్ ఎంతో ప్రేమిస్తున్నట్లు నటించడంతో రజిత అతడిని నమ్మేసి, ప్రేమించడం మొదలుపెట్టింది. చివరికి రజిత తన తల్లిదండ్రులను ఒప్పించి రోహిత్ను పెళ్లి చేసుకుంది. కానీ రోహిత్ మాత్రం ఏమాత్రం సంపాదించకుండా, పనిపాట లేక జల్సాలకు అలవాటు పడ్డాడు. రజిత ప్రముఖ ఇంటర్నేషనల్ పాఠశాలలో చైల్డ్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. రజిత జీతం డబ్బులు కూడా రోహిత్ తీసుకుని, ఖర్చుచేసేవాడు. చెడు అలవాట్లను మానుకోవాలని రజిత పలుమార్లు రోహిత్ కు చెప్పినా, అతడు వినకపోగా భార్యనే వేధించడం మొదలుపెట్టాడు.

నిద్రమాత్రలతో ఆత్మహత్యకు యత్నం

రోహిత్ తో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరులు కూడా రజితను వేధించడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రోజురోజుకు వేధింపులు అధికం కావడంతో గతనెల 16న రజిత నిద్రమాత్రలు మింగారు. కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చర్పించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. చికిత్సఅనంతరం ఇంటకి వచ్చిన రజిత మళ్లీ జులై 28న బాత్రూమ్ కిటికీ నుంచి కిందకు దూకి మరోసారి ఆత్మహత్యాయత్నం చేశారు. తలకు తీవ్రమైన గాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. పోలలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో ఉ
న్నతమైన చదువులు చదివిన తమ కూతురు తమను ఉద్దరిస్తుందనే ఆశతో ఉన్న రజిత తల్లిదండ్రులకు కడుపుకోత, ఆవేదనే మిగిలింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/harish-rao-harish-rao-will-go-to-achampet-for-party-functions/telangana/527244/

Breaking News Crime News Doctor Suicide Case Domestic Harassment latest news love marriage tragedy mental health Telugu News woman ends life

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.