📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Digital Arrest: కేంద్ర మంత్రి సంతకంతో..99 లక్షల దోపిడి

Author Icon By Tejaswini Y
Updated: November 13, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ కొత్త పద్ధతులతో అమాయకులను వలలోకి దింపుతున్నారు. తాజాగా వారు ప్రభుత్వ పెద్దల పేర్లు, సంతకాలను కూడా ఫోర్జరీ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇటీవల పుణెలో చోటుచేసుకున్న ఘటనలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో నకిలీ అరెస్ట్ వారెంట్(Digital Arrest) సృష్టించి, ఒక విశ్రాంత ఎల్‌ఐసీ మహిళా అధికారిణిని రూ.99 లక్షల మేర మోసం చేశారు.

Read Also:  AP: భాగస్వామ్య సదస్సుకు విశాఖ రెడీ

ఎలా జరిగింది మోసం

పుణెలోని కోత్రుడ్ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల మహిళకు అక్టోబర్ చివర్లో ఒక వ్యక్తి ఫోన్ చేసి, తాను “డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ” అధికారి అని పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని చెప్పి భయపెట్టాడు.

తరువాత మరో వ్యక్తి, తాను సీనియర్ పోలీస్ అధికారి “జార్జ్ మాథ్యూ” అని చెబుతూ వీడియో కాల్ చేశాడు. మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యిందని, ఆమె బ్యాంకు ఖాతాలు సీజ్ చేయనున్నట్లు చెప్పాడు. అంతేకాదు, నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం, ప్రభుత్వ ముద్రతో కూడిన అరెస్ట్ వారెంట్ను వాట్సాప్‌లో పంపించారు.

‘డిజిటల్ అరెస్ట్’ మాయ

మోసగాళ్లు బాధితురాలిని వాట్సాప్ కాల్‌లోనే ఉంచి, “డిజిటల్ అరెస్ట్”(Digital Arrest)లో ఉన్నట్లుగా నటించారు. ఆమె వద్ద ఉన్న నిధులను “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు” బదిలీ చేయమని ఆదేశించారు. భయంతో ఆమె రూ.99 లక్షలను పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. కొంతసేపటి తర్వాత కాల్ కట్ అయి, నంబర్లు స్విచ్ఛాఫ్ కావడంతో తాను మోసపోయానని గ్రహించి, వెంటనే పుణె సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బు వెళ్లిన ఖాతాలను బ్లాక్ చేయడానికి చర్యలు ప్రారంభించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Cyber Crime in India Cyber Police India Digital arrest fraud Nirmala Sitharaman Telugu News online WhatsApp scam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.