📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Dharmasthala: మృతదేహాలను ఖననం చేసిన వారిలో మరో ఆరుగురు!

Author Icon By Vanipushpa
Updated: August 6, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల(dharmasthala) పుణ్య క్షేత్రంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన చేతులతో వందల మంది అమ్మాయిల(Girls)ను పూడ్చిపెట్టినట్లు ఎస్పీ(SP)కి లేఖ ద్వారా తెలిపాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సిట్ ధర్మస్థల పుణ్యక్షేత్రంలో తవ్వకాలు చేపట్టింది. అయితే కేవలం ఈ పారిశుద్ధ్య కార్మికుడు మాత్రమే కాదు.. మరో ఆరుగురు వ్యక్తులు మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు ముందుకు వచ్చారు. ఫిర్యాదుదారుడు చేసిన ప్రకారం సిట్(Sit) అధికారులు ఇప్పటి వరకు 13 చోట్ల తవ్వకాలు జరిపారు. ఇందులో పాయింట్ నంబర్ 6 వద్ద అస్థిపంజరం, ఎముకలు వంటివి లభ్యమయ్యాయి.

Dharmasthala: మృతదేహాలను ఖననం చేసిన వారిలో మరో ఆరుగురు!

మరో ఆరుగురు ఆరోపణలు చేసినట్లు..
ఇప్పుడు మరో ఆరుగురు రావడంతో ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఈ ఆరుగురు కూడా మృతదేహాలను ఖననం చేసిన ప్లేస్‌లో తవ్వకాలు చేపడితే ఆధారాలు దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా కంప్లైంట్ ఇవ్వకుండా ఇన్ని రోజులు వీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సిట్ 13 ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఇందులో ఆస్థిపంజరాల ఆనవాళ్లు, వస్తువులు లభ్యమయ్యాయి. 13 స్పాట్లు మాత్రమే కాకుండా మరికొన్ని చోట్ల పూడ్చిపెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ నేత్రావతి నది పరిసర ప్రాంతాలు అన్ని కూడా 15 ఏళ్లలో పూర్తిగా మారిపోయాయి.
ఓ పారిశుద్ధ్య కార్మికుడు జిల్లా ఎస్పీకి లేఖ
ఈ ప్రాంతంలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికుడు మహిళలను ఈ ప్రదేశంలో ఖననం చేసినట్లు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. 1995 నుంచి 2014 సమయంలో ఇలా ఎందరో మహిళలను రహస్యంగా పూడ్చిపెట్టినట్లు లేఖలో తెలిపాడు. దీంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఈ కేసుతో అనుమానాలు

ఓ వైద్య విద్యార్థిని కొన్నేళ్ల కిందట ఇక్కడ అనుమానాస్పదంగా కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని తెలిపింది. అయితే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ పుణ్య క్షేత్రంలో ఎన్నో వందల మహిళలు, విద్యార్థినులు అదృశ్యమయ్యారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒంటరిగా అమ్మాయిలు ఇక్కడికి వెళ్లాలంటే భయపడుతున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో ఇలా ఎందరో అమ్మాయిల ఆశలన్నీ ఇక్కడే గాల్లో కలిసిపోయాయని తెలుస్తోంది.

ధర్మస్థలం దేనికి ప్రసిద్ధి చెందింది?
ధర్మస్థల - కర్ణాటకలోని ఉత్తమ దేవాలయాలు - కర్ణాటక టూరిమ్
ధర్మస్థలం మత, మత మరియు సాంస్కృతిక సామరస్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మంజునాథ ఆలయం మధ్వ వైష్ణవ మతాన్ని కలిగి ఉన్న ప్రముఖ శైవ కేంద్రం.
డాక్టర్ డి. వీరేంద్ర హెగ్గడే
డాక్టర్ డి. వీరేంద్ర హెగ్గడే అధ్యక్షతన SDM సంస్థల గమ్యాన్ని నిర్దేశించే SDME ట్రస్ట్, ఉజిరేలోని ఒక నిరాడంబరమైన భవనం నుండి పనిచేస్తుంది. అత్యున్నత సంస్థగా, ఇది సొసైటీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరైన ప్రతిచర్యను ప్రేరేపించే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/lords-cricket-ground-unexpected-guest-at-lords-ground-shocked-players-and-spectators/international/526718/

Crime Investigation Crime News India Dharmasthala case Forensic Probe Human Remains Illegal Burial Karnataka News Latest News Breaking News Mass Grave Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.