ఒకే నెల వ్యవధిలో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుని, ఏడాది పాటు ఈ విషయాన్ని దాచిపెట్టిన ఒక వ్యక్తి చివరకు పట్టుబడ్డాడు. ఇద్దరు భార్యలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడు అరెస్ట్ అయ్యాడు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం రామకృష్ణ దూబే (రాహుల్ పేరుతో కూడా పరిచయం) ఓ డెలివరీ(Delivery Boy) కంపెనీలో పనిచేస్తాడు. 2024 నవంబర్‌లో తన ప్రేయసి ఖుష్బూతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కేవలం నెల రోజుల్లోనే కుటుంబ సభ్యులు చూసిన శివంగిని మరోసారి పెళ్లి చేసుకున్నాడు.
Read Also: Jagan: నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగిసినది
రెండు జీవితాలను రహస్యంగా నడిపించాడు
ఉద్యోగం స్వభావం వల్ల ఎక్కువసేపు బయటే ఉంటూ రెండు జీవితాలను రహస్యంగా నడిపించాడు. ఈ సమయంలో ఖుష్బూతో ఒక ఆడబిడ్డ కూడా పుట్టింది. కానీ ఒక ఫోన్ కాల్ అతని అబద్దాల రాజ్యాన్ని కూల్చేసింది. ఖుష్బూ భర్తకు ఫోన్(Phone) చేయగా, రెండో భార్య శివంగి కాల్ తెరచడంతో ఇద్దరికీ అనుమానం కలిగింది. ఖుష్బూ తన పెళ్లి ఫోటోలు పంపిన తరువాత అసలు నిజం బయటపడింది.
అంతట ఇద్దరు మహిళలు కలిసి పోలీసు(Police)లను ఆశ్రయించి, రామకృష్ణ ఇద్దరినీ మోసం చేశాడని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని బహుభార్యత్వం కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: