Delhi Murder: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక సంచలన నిజాలు బయటపడ్డాయి. తొలుత ప్రమాదం అనుకున్న ఈ కేసు దర్యాప్తులో హత్యగా మారింది. తిమార్పూర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో అక్టోబర్ 6న కాలిపోయిన శవం కనుగొనగా, అది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న రామ్‌కేశ్ మీనా (32) దేనని గుర్తించారు. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు, ఘటనకు ముందు ఇద్దరు వ్యక్తులు మరియు ఒక యువతి భవనంలోకి వెళ్లినట్లు గుర్తించారు.
Read also: MadhyaPradesh: చనిపోతూ కసి తీర్చుకున్న పాము.. మృత్యువు చేరుకున్న యువతీ
Delhi Murder: బాయ్ ప్రెండ్ ని చంపి ప్రమాదంగా చిత్రీకరించిన ప్రియురాలు
Delhi Murder: దీంతో ఆ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను ఫోరెన్సిక్ విద్యార్థిని అమృతా చౌహన్‌గా గుర్తించారు. విచారణలో రామ్‌కేశ్‌తో సహజీవనం చేసిన అమృతా, అతడు తాను రికార్డ్ చేసిన ప్రైవేట్ వీడియోలను డిలీట్ చేయకపోవడంతో కోపంతో హత్యకు పాల్పడినట్లు ఒప్పుకుంది. మాజీ లవర్, మరో స్నేహితుడి సాయంతో రామ్‌కేశ్‌ను గొంతు నులిమి చంపి, మృతదేహంపై నూనె, నెయ్యి చల్లి గ్యాస్ సిలిండర్ పేల్చి నిప్పంటించి ఘటనను ప్రమాదంగా మలిచారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుడు ఎవరు?
మృతుడు సివిల్ సర్వీసెస్ అభ్యర్థి రామ్‌కేశ్ మీనా.
పోలీసులు ఈ ఘటనను ఎలా గుర్తించారు?
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది ప్రమాదం కాకుండా హత్య అని పోలీసులు నిర్ధారించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: