Delhi: బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

Read Time:  1 min
Delhi
Delhi
FONT SIZE
GET APP

ఢిల్లీలో(Delhi) పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 8:33 గంటల సమయంలో తొలి సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో వెంటనే స్కూళ్లను ఖాళీ చేయించి విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపించారు.

Read Also:Death Mystery: జెఫ్రీ ఎప్‌స్టీన్ చావుకు ముందే డెత్ స్టేట్‌మెంట్ రెడీ?

Delhi

పాఠశాలల ప్రాంగణాల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువులు ఏవైనా ఉన్నాయా అనే దిశగా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి.

అనుమానాస్పద ఈమెయిల్‌తో కలకలం.. పార్లమెంట్‌పై దాడి హెచ్చరిక

ఈ బెదిరింపులకు సంబంధించిన ఈమెయిల్‌లో తీవ్రవాద(Delhi) వ్యాఖ్యలు ఉండటంతో పాటు పార్లమెంట్‌పై దాడి జరగవచ్చని హెచ్చరికలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈమెయిల్ పంపిన వారి వివరాలను గుర్తించేందుకు సైబర్ నిపుణులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు, విద్యార్థులు భయాందోళనకు గురికావద్దని, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.