📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Delhi Crime: ఢిల్లీ ప్రియుడి హత్యకేసులో సంచలన విషయాలు..

Author Icon By Rajitha
Updated: October 29, 2025 • 4:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Crime: లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నారు. తమ బిడ్డ బంగారు భవితకు ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. తమ పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే తమకు అంతే చాలని రాత్రీపగలు శ్రమిస్తున్నారు. కాని కొందరు మాత్రం తమ స్వార్థం, జెల్సాలకు అలవాటుపడి, జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. చదువుకునే వయసులోనే ప్రేమలు.. సహజీవం అంటూ రహస్యంగా తమ వాంఛల్ని తీర్చుకుంటున్నారు. ఆకర్షణే ప్రేమగా భావిస్తూ, మోసపోతున్నారు. తద్వారా ఊహించని నష్టాలకు, ఇబ్బందులకు గురవుతున్నారు. దేశరాజధాని ఢిల్లీ (Delhi) లో ప్రియుడిని హతమార్చిన ప్రియురాలికి ఇదే జరిగింది. యూపీఎస్సీ అభ్యర్థి రామ్ కేశ్ మీనా హత్య కేసులో పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రామ్ కేశ్ అమృతతో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలు డిలీట్ చేయకపోవడంతో మరో ఇద్దరితో కలిసి రామ్ కేశ్ ను హత్య చేసింది.

Read also: TG Crime: ఇన్‌స్టాగ్రామ్ లో ప్రేమ.. గర్భం దాల్చిన బాలిక

తర్వాత దాన్ని ఫైర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించింది. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో 15మంది మహిళల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్క్ కోసమే హత్య ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని అయిన అమృత తన ప్రైవేట్ వీడియోలను డిలీట్ చేయాలని అమృత ఎంతగానో వేడుకుంది. అయినా అందుకు రామ్ కేశ్ నిరాకరించాడు. దీంతో ఆ హార్డ్ డిస్క్ ను తీసుకోవడానికి, రామ్ కేశ్ అడ్డు తొలగించుకోవడానికి అమృత తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్, అతని స్నేహితుడు సందీప్ కుమార్ తో కలిసి కుట్ర పన్నింది. హత్యను సాధారణ ప్రమాదంగా చిత్రీకరించేందుకు అమృత తన ఫోరెన్సిక్ పరిజ్ఞానాన్ని, క్రైమ్ వెబ్ సిరీస్ ల నుంచి నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించింది.

గొంతు నులిమి హత్య చేశారు.

Delhi Crime: పథకంలో భాగంగా, అక్టోబర్ 5న రాత్రి ముగ్గురూ కలిసి రామ్ కేశ్ ఫ్లాట్ కు వెళ్లి గొంతు నులిమి హత్య (Murder) చేశారు. ఆ తర్వాత ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంగా కలిపించేలా చేయడానికి, మృతదేహం పై నెయ్యి, నూనె, మద్యం పోశారు. అనంతరం వంటగదిలోని ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్ ను తెరిచి, ప్లాట్కు తాళం వేసి పారిపోయారు. గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో ప్లాట్ లో భారీగా మంటలు చెలరేగాయి. అయితే, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణ ద్వారా ఇది హత్య అని పోలీసులు నిర్ధారించి, అమృతతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. హార్డ్ డిస్క్ తో పాటు హత్యకు ఉపయోగించిన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోటీపరీక్షల పేరుతో రామ్ కేశ్ మీనా.. చదువు పేరుతో అమృత సహజీవనం చేశారు. తమ కెరీర్ జీవితాన్ని అద్భుతంగా మలచుకుంటున్న సమయంలో ఇలాంటి సున్నిత విషయాలకు దూరంగా ఉండడం మంచిది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

    Amrita case Crime News Delhi murder latest news Telugu News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.