రోజురోజుకి మహిళలకు భద్రత కరువవుతోంది.ఈ నేపథ్యంలో,ఢిల్లీలో ఒక హత్య కేసు ‘దృశ్యం’ సినిమా కథను తలపించేలా వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఒక వ్యక్తి ఆమెను కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టి, ఆపై ఆమె ప్రియుడితో పారిపోయిందని చూపించేందుకు పెద్ద నాటకం ఆడాడు. అయితే, ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) ఆధారంగా పోలీసులు మిస్టరీని ఛేదించి నిందితుడిని, అతనికి సహకరించిన స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.సౌత్ డీసీపీ అంకిత్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన షాదాబ్ అలీ (47) ఢిల్లీలో పెయింటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. భార్య ఫాతిమా (30) ప్రవర్తనపై అతనికి కొంతకాలంగా అనుమానం పెరుగుతూ వచ్చింది. ఆమెకు ఇతర వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన షాదాబ్, చివరికి భార్యను చంపాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
షాదాబ్ తన సొంత ఊరైన అమ్రోహాకు వెళ్లిపోయాడు
పథకం ప్రకారం, సుమారు ఐదు రోజుల పాటు భార్యకు బలవంతంగా మత్తు మందులు, పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం షారుఖ్ ఖాన్, తన్వీర్ అనే ఇద్దరు స్నేహితుల సహాయంతో ఆగస్టు 2న రాత్రి ఆమె మృతదేహాన్ని కారులో మెహ్రౌలీ (Mehrauli) లోని ఒక శ్మశానవాటికకు తీసుకెళ్లి పాతిపెట్టాడు. ఆమె బట్టలను ఒక కాలువలో పడేశాడు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, షాదాబ్ తన సొంత ఊరైన అమ్రోహాకు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఫాతిమా ఫోన్ నుంచే తన ఫోన్‌కు ‘నేను వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతున్నాను’ అని ఒక టెక్స్ట్ మెసేజ్ పంపుకున్నాడు. అయితే, ఆగస్టు 10న ఫాతిమా స్నేహితురాలు ఒకరు మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఆమె కనపడటం లేదని, ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
షాదాబ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు
విచారణలో భాగంగా పోలీసులు పరిశీలించిన ఒక సీసీటీవీ ఫుటేజీలో, ఫాతిమా తన భర్త, అతని స్నేహితులతో కలిసి అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో పోలీసులు షాదాబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట నేరాన్ని అంగీకరించని షాదాబ్, శవాన్ని కాలువలో పడేశానని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు.షాదాబ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆగస్టు 15న సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) సమక్షంలో ఫాతిమా మృతదేహాన్ని వెలికితీశారు. ఈ కేసులో షాదాబ్, షారుఖ్, తన్వీర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: