📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Delhi Crime: కదులుతున్న వ్యాన్ లో యువతిపై సామూహిక అత్యాచారం

Author Icon By Rajitha
Updated: January 1, 2026 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో స్త్రీలకు ఏమాత్రం భద్రత అనేది లేదు. అర్ధరాత్రి కాదు పట్టపగలే వారికి రక్షణ లేదు. రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటలకు డ్యూటీని ముగించుకుని ఇండ్లకు క్షేమంగా వెళ్తామనే భరోసా లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు ఆమెపై లైంగిక దాడులకు పాల్పడే కామంధుల ఆకృత్యాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తల దించుకునే సంఘటన జరిగింది. కదులుతున్న వ్యాన్ లో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు (Gang rape) సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో ఈ ఘటన జరిగింది. ఇంటికి వెళ్లేందుకు ఎదురు చూస్తున్న మహిళను లిఫ్ట్ పేరుతో కారులోకి ఎక్కించుకుని రేప్ చేశారు.

Read also: Khammam crime: యాచకుడిని అతికిరాతంగా కొట్టి చంపిన వ్యక్తి

Delhi Crime

లిఫ్ట్ పేరుతో లైంగిక దాడి

సోమవారం రాత్రి 23ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో అటుగా వెళ్లోన్న ఓ వ్యాన్ ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఆమెకు లిఫ్ట్ ఇస్తామని, ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు అందులోకి ఎక్కించుకున్నారు. కానీ తరువాత ఆమెను ఇంటికి కాకుండా గురుగ్రామ్ రోడ్డు వైపు కారు పోనిచ్చి దాదాపు మూడు గంటలకు పైగా ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వదిలేయాలని కాళ్లావేళ్లా పడి వేడుకున్నా కనికరించలేదు సరికదా బెదిరింపులకు దిగారు. తనను రక్షించాలని ఆమె కేకలు వేసినా రోడ్డుపై ఉన్నవారికి వినిపించలేదు. మూడు గంటల పాటూ నరకం చూపించి చివరకు తెల్లవారు ఝామున గంటల సమయంలో ఎస్టీమ్ నగర్ లోని రాజా చౌక్ దగ్గర కదులుతున్న వ్యాన్ నుంచి ఆమెను కిందకు తోసేశారు.

మహిళ ముఖంపై విపరీతంగా గాయాలు

దీంతో ఆమె ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. సోదరికి సమాచారం ఇచ్చిన బాధితురాలు రక్తమోడుతున్న బాధితురాలు అలాగే తన సోదరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మహిళ ముఖంపై విపరీతంగా గాయాలు అయ్యాయి. డాక్టర్లు 14 కుట్లు వేశారు. ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ తీవ్ర షాక్ కు గురైందని చెప్పారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విబేధాలు కారణంగా ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోంది. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Faridabad rape case latest news Telugu News women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.