మరికాపేసట్లో తమ ఇంటికి చేరుకుని, తమ కుటుంబ సభ్యులతో హాయిగా ఉందామనుకున్న వారి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 13మంది మరణించినట్లుగా వేదన తెలుస్తోంది. మరెందరో గాయపడ్డారు. తమ ప్రియులను కోల్పోయిన బంధువులు, కుటుంబ సభ్యుల వర్ణనాతీతం. ఇక ఈ ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.(Delhi blast) ఈ కేసును విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్పగించింది. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుంది.
Read also: విద్యా హక్కు పరిరక్షణ అందరి బాధ్యత
రంగంలోకి ఎన్ఐఏ, ఎఫ్ ఎస్ ఎల్, ఫోరెన్సిక్ నిపుణులు
కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఎఫ్ ఎస్ ఎల్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. కాగా మరోవైపు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మంగళవారం అంగోలా నుంచి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఎర్రకోట(Delhi blast) సమీపంలో జరిగిన పేలుడు గురించి ఆరా తీశారు అని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) మంగళవారం మధ్యాహ్నం మరో భద్రతా సామావేశాన్ని ఏర్పాటు చేశారు. అత్యుననత దర్యాప్తు సంస్థలు ఈ పేలుడు ఘటనను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: