PG doctor suicide : నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన అనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తేలడంతో సీనియర్ డాక్టర్ అమర్ సహస్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమ వ్యవహారంలో విభేదాలు
పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన అమర్ సహస్‌రెడ్డి, అనంతపురానికి చెందిన దీపిక గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే అమర్ తన ఎంబీబీఎస్ బ్యాచ్‌మేట్‌తో పెళ్లి నిశ్చయం చేసుకుని దీపికను దూరం పెట్టడం ప్రారంభించాడు.
మరణానికి ముందు ఫోన్ సంభాషణ
దీపిక మృతి చెందిన రోజు రాత్రి 10:40 నుంచి అర్ధరాత్రి 12:30 వరకు ఇద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ జరిగింది. తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని అమర్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
Read Also: KCR Iftar Tradition: 35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య
ఆపరేషన్ థియేటర్లలో వాడే మత్తు ఇంజక్షన్‌ను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే దీపిక మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. కాల్ డేటా రికార్డులు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: