📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Darjeeling: డార్జిలింగ్ లో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి?

Author Icon By Anusha
Updated: October 5, 2025 • 1:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పశ్చిమ బెంగాల్ (West Bengal) లో రాత్రంతా కురిసిన అనవరత వర్షాల కారణంగా రాష్ట్రంలోని కొండప్రాంతాలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా డార్జిలింగ్ (Darjeeling) జిల్లాలోని మిరిక్, సుఖియా పొఖారీ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపోయాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Mohanlal: మోహన్‌లాల్‌కు కేరళ ప్రభుత్వం సన్మానం

అనేక మంది ఇంకా భూకంపం కారణంగా ఏర్పడిన శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కీలక మార్గాల్లో రోడ్డు రవాణా నిలిచిపోయింది. సిక్కింతో రవాణా వ్యవస్థ తెగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ (Rescue teams) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో శనివారం రాత్రి (అక్టోబర్ 4) భారీ వర్షాలు కురిశాయి.

మిరిక్- కుర్సియాంగ్ పర్యాటక ప్రదేశాలను కలిపే దుడియా ఇనుప వంతెన కూలిపోయింది. కుర్సియాంగ్ సమీపంలోని నేషనల్ హైవే 110 వెంబడి కొండచరియలు విరిగిపడ్దాయి. దీంతో పోలీసులు, స్థానిక యంత్రాంగాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. డార్జిలింగ్, సిలిగుడితో సిక్కింని కలిపే రహదారుల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.

వాతావరణం గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని

కాగా, దుర్గా పూజ తర్వాత కోల్‌కతా నుంచి డార్జిలింగ్, ఇతర ప్రాంతాలకు వెళ్లే పర్యటకులు మధ్యలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.కొండచరియలు విరిగిపడుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.. టైగర్ లిగ్, రాక్ గార్డెన్ సహా డార్జింలింగ్‌లోని అన్ని పర్యటక ప్రాంతాలను మూసివేశారు. టాయ్ ట్రైన్‌ సేవలు కూడా నిలిపివేశారు.

ఇక స్థానికులు, పర్యటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పారు. వాతావరణం గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చెప్పారు.కొండచరియలు విరిగిపడి రహదారులు ధ్వంసమవడంతో నేషనల్ హైవేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Infrastructure Development Corporation Limited) రంగంలోకి దిగింది.

జిల్లా యంత్రాంగంతో కలిసి రోడ్లను పునరుద్ధరించేందుకు

జిల్లా యంత్రాంగంతో కలిసి రోడ్లను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న చోట్ల ఎన్డీఆర్ఎఫ్, సివిల్ ఢిపెన్స్ వలంటీర్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వర్షపాతం వల్ల జరిగిన నష్టంపై డార్జిలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా ఆందోళన వ్యక్తం చేశారు.

“డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా భారీ నష్టాలు సంభవించాయి. దాని గురించి నేను చాలా బాధపడ్డాను. ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మౌలిక సదుపాయాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుత పరిస్థితిని నేను అంచనా వేస్తున్నాను.” రాజు బిస్తా తెలిపారు.పశ్చిమ బెంగాల్‌లోని ఉప హిమాలయ జిల్లాల్లో..

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం వరకు కురిస్తాయని తెలిపింది. డార్జిలింగ్‌తో పాటు కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్పైగుడి, అలీపుర్దువార్ జిల్లాలలోనూ ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రెడ్ అలర్ట్‌ ప్రకటించారు అధికారులు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News darjeeling landslide landslide casualties latest news mirik landslide news sukhiya pokhari landslide Telugu News west bengal flood update west bengal heavy rains

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.