📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

LPG cylinder: ముంబయిలో సిలిండర్ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

Author Icon By Shobha Rani
Updated: June 23, 2025 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబయి(Mumbai)లోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్‌స్టౌవ్‌కు సిలిండర్‌ (LPG cylinder) బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ పైప్‌ ఊడిపోయింది. దానిని తిరిగి పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ పైపులో నుంచి గ్యాస్‌ ఎగజిమ్మడంతో సాధ్యం కాలేదు. దీంతో సిలిండర్‌(LPG cylinder)ను కిచెన్‌లో నుంచి బయటకు తెచ్చి హాల్‌లో పడేసిన ఆ మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. సిలిండర్‌ కిందపడి ఉండడంతో పైప్‌ నుంచి లీక్‌ అయిన గ్యాస్‌ ఇళ్లంతా వ్యాపించింది. కొన్ని క్షణాలకు గ్యాస్‌ రావడం ఆగిపోవడంతో ఇంట్లోకి వచ్చిన ఆ మహిళ మరో వ్యక్తి సహాయంతో సిలిండర్‌ను అక్కడినుంచి తీయడానికి ప్రయత్నించింది.
పేలుడు దృశ్యాలు – సీసీటీవీలో భయానక క్షణాలు
అంతలోనే క్షణాల్లో పెద్దఎత్తున పేలుడు సంభవించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. తెరిచి ఉన్న రెండు తలుపుల నుంచి వెంటనే వారిద్దరూ ఒక్క ఉదుటన బయటకు పారిపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వారి ఇంట్లోని హాలులో ఉన్న సీసీ కెమెరాలో ఈ భయానక దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకున్నట్లు పలు జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నప్పటికీ.. కచ్చితమైన ప్రాంతం మాత్రం తెలియరాలేదు. వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం జూన్‌ 18న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘అదృష్టవశాత్తూ ఆ ఇంటికి ఉన్న రెండు తలుపులు, కిటికీలు తెరిచి ఉండడంతో లీకైన గ్యాస్‌ (Gas) బయటకు వెళ్లడంతో ప్రమాద తీవ్రత తగ్గింది’ అని పేర్కొన్నారు.
సురక్షితంగా బయటపడ్డ మహిళ
దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్‌ను గ్యాస్‌స్టౌవ్‌కు బిగిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. ఎల్‌పీజీ గ్యాస్‌(Gas)లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిపుణుల సలహా తీసుకోకుండా దానివద్దకు వెళ్లడం ప్రమాదకరమని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘వీడియో చూస్తున్నంతసేపు నేను

LPG cylinder: ముంబయిలో సిలిండర్ పేలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం

ఊపిరి బిగబట్టే ఉన్నాను. ఇటువంటి ప్రమాదాలను నివారించాలంటే ప్రతిఒక్కరూ గ్యాస్‌ (Gas) భద్రతకు సంబంధించిన ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి’ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చారు. వంట పనులు పూర్తవగానే ఎప్పటికప్పుడు గ్యాస్ (Gas) ఆఫ్‌ చేసుకోవడం సురక్షితం అని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్యాస్ సురక్షతకు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
గ్యాస్ (Gas) స్టౌవ్ వాడకపోతే వెంటనే వాల్వ్ ఆఫ్ చేయాలి. గ్యాస్ సిలిండర్‌కు పైప్‌ను బిగించే ముందు లీక్ ఉందేమో పరిశీలించాలి. గ్యాస్ వాసన వస్తే ఏ విధమైన ఎలక్ట్రికల్ పరికరాలను ఆన్ చేయరాదు. వెంటనే గది తలుపులు, కిటికీలు తెరచి గ్యాస్ బయటకు పంపాలి. సమస్య ఎదురైతే నిపుణులను లేదా హెల్ప్‌లైన్‌ సర్వీసులను సంప్రదించాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ గ్యాస్ (Gas) భద్రతకు సంబంధించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ఇది మన ప్రాణాలకు రక్షణ కవచంగా నిలుస్తుంది.

Read Also: Brazil: బ్రెజిల్‌లోని శాంటా కేథరినాలో గగనతలంలో మరో ఘోరం.. మంటల్లో

Breaking News in Telugu Cylinder explosion in Mumbai.. GasCylinderBlast Google news KitchenSafety Latest News in Telugu LPGExplosion MumbaiIncident narrowly avoided accident Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.