📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Cybercrime : అద్దెకు దిగుతామంటూ లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు

Author Icon By Shravan
Updated: August 18, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : సైబర్ నేరాలు (Cybercrime) కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియకుండా వుండడంతో ఏ పాపం తెలియని అమాయకులు కేసుల్లో ఇరుక్కుని ఇక్కట్లు పడుతుండగా సైబర్ నేరగాళ్లు మాత్రం దర్జాగా అందినంత దోచుకుంటూ జల్సాగా జీవి స్తున్నారు. కొత్త తరహాలో వెలుగు చేసిన సైబర్ నేరాల్లో ముఖ్యమైనది అద్దె ఇంట్లో దిగుగూ ఇళ్ల యజమానుల ఆధార్ కార్డులు, బ్యాంకుల ఖాతాల వివరాలు తీసుకుని, వాటిని సైబర్ నేరాలకు సంబంధించిన లావాదేవాలకు వాడడం, ఈ తరహా నేరాల్లో సైబర్ నేరగాళ్లు మొదట అద్దె ఇంట్లోకి ది గుతారు. ఇంటి యజమాని ఆధార్ కార్డును తీసుకుంటారు. ఇంటి యజమాని ఆధార్ కార్డు వుంటేనే తాము ఫలానా వ్యక్తి ఇంట్లో అద్దెకు వుంటున్నామని, తమ కంపెనీ నమ్ముతుందని, ఇంటి అద్దె ఇస్తుందని నమ్మబలుకుతారు. దీని తరువాత ఇంటి యజమాని బ్యాంకు ఖాతాను, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులు తీసుకుంటారు.

వీటి ఆధారంగా లాగిన్ ఐడీ, పాస్వర్డ్లు తీసుకుంటారు. వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు నేరాలకు శ్రీకాకంచుడతారు. ఇంటి యజమాని బ్యాంకు ఖాతాల ద్వారా సైబర్ నేకాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ విషయం ఎప్పుడో కానీ ఇంటి యజమానులకు తెలియదు. తీరా తెలిసే సమయానికి పోలీసులు కేసు నమోదు చేసి వారిని నిందితులుగా చూపుతారు. అవసరం అయితే అరెస్టు చేసి వారిని జైళ్లకు కూడా పంపుతున్నారు. నగరంలోని సనత్నగర్కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన సొంత బావమరిదికి అడగగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్ కార్డు ఇచ్చాడు.

మూడు నెలల తరువాత సదరు ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో సైబర్ నేరాలకు సంబంధించి లక్ష లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేను నమోదు చేసి విచారణకు పిలిచారు. తనకు ఇదంతా ఏమీ తె లియదని, తన బావమరిది అడిగితే ఇచ్చానని చెప్పగా అదంతా …. బావమరిది తేల్చుకోవాలి… అంటూ ఆటో డ్రైవర్ను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. ఇటువంటిదే శివార్లలో వెలుగు చూసింది. 20 వేల రూపాయలకు పెద్ద ఇంటిని తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఈ క్రమంలో ఇం టి యజమానిని దోస్తీ చేసుకుని అతని బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని వీటి ద్వారా సైబర్ నేరాలకు దిగారు. ఈ కేసులో ఇంటి యజమాని బ్యాంకు ఖాతాలో 25 లక్షల రూపాయల సైబర్ నేరాల లావాదేవీలు జరిగినట్లు తేలింది.

ఈ నేరం వెలుగుచూసే సమయానికి సైబర్ నేర గాళ్లు

ఉడాయించగా ఇంటి యజమాని పోలీసు కేసులో ఇరుక్కుని ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ తరహా మోసాలు దేశ వ్యాప్తంగా అనేకచోట్ల వెలుగు చూడడం ఆయా ప్రాంతాలలో సంచలనం రేపింది. బడా సైబర్ నేరగాళ్లు విదేశాల్లో వుంటుండగా వారికి అనుచరులుగా వుంటున్న వారు భారత్లోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలలో వుంటున్నారు. వీరికి ఏజెంట్లుగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారుంటున్నారు. ఈ ఏజెంట్లు కొందరు సబ్ ఏజెంట్లను నియమించుకుని తెలివిగా ఆయా బస్తీలలో వుండే ఆటో డ్రైవర్లు, సామాన్య కూలీల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి, వారికి కొంత క మీషన్ ఇస్తున్నారు. ఇలాంటి కేసుల్లో కూలీలు, ఆటో డ్రైవర్లు పోలీసు కేసుల్లో (Police case) ఇరుక్కోగా తాజాగా ఇళ్ల యజమానుల వంతు వచ్చింది. ముందుగా ఆయా ప్రాంతాలలో అద్దెకు వుండే ఇళ్లను కనుగొని సైబర్ నేరగాళ్లు అక్కడ దిగుతున్నారు. ఇంటి యజమాని అడిగినంత అద్దె ఇచ్చేందుకు సిద్ధమవ డంతో పాటు ఐదారు నెలల అడ్వాన్స్ కూడా ముందుగానే ఇచ్చేస్తున్నారు. అనంతరం వారి నమ్మకాన్ని చూరగొని ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలను, డెబిట్ కార్డులను తీసుకుని వీటి ఆధారంగా సైబర్ నేరాలకు సంబంధించిన లావాదేవీలు నడుపుతున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు ఖాతాదారులను అరెస్టు చేసే సమయానికి నేరాలకు పాల్పడిన వారు ఉడాయిస్తున్నారు. ఎవరికి పడితే వారికి బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవ్వకూడదని వారు హెచ్చరిస్తున్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/new-delhi-is-changing-the-face-of-counterfeit-goods/national/532018/

Breaking News in Telugu CyberCrime House Rent Scam Latest News in Telugu Online Fraud Paper Telugu News Rental Fraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.