సైబర్ Cyber నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా స్నేహాలను అసలు నమ్మకూడదు. ముక్కుమొహం తెలియని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఆర్థిక సాయం చేయాల్సి వస్తే, అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసుకుని, మరి ఇవ్వాలి. అంతేకానీ,ఎదుటివారు చెప్పే విషయాలన్ని నిజమేనని నమ్మితే చివరికి మోసపోయేది మనమే. ఎందుకు ఇదంతా చెబుతున్నారని అనుకుంటున్నారా? ఓ ఉపాధ్యాయురాలి ఓ వ్యక్తిని నమ్మి ఏకంగా రూ.2.5 కోట్లు పోగొట్టుకుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. పెళ్లిపేరుతో మోసం బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఓ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది.
Crime: ఆయాల మధ్య గొడవ.. రెండు నెలల పసికందు మృతి
Cyber
సోషల్ మీడియా
కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించాడు. ఆమెకు పిల్లలు లేకపోవడంతో కొంతకాలం ఒంటరిగా జీవించింది. అయితే ఆమె తిరిగి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా 2019లో ఆమె ఒక మ్యాట్రిమోనీ సైట్ లో తన వివరాలు పొందుపరచింది. ఆ సమయంలో అదే సైట్ లో ఆకాశ్ కుమార్ అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని సంప్రదించాడు. నేనూ భారతీయుడినే. అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నా.. ఓ ఇజ్రాయెల్ Israel కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నా’ అంటూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. దీన్ని ఆ ఉపాధ్యాయురాలు నమ్మేసింది. పెళ్లి పేరుతో డబ్బు వసూలు కొంతకాలం పాటు ఇద్దరి మధ్య ఫోన్ కాల్, చాటింగ్ లు నడిచాయి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అలా ఏడాది గడిచింది. ఆ మరుసటి సంవత్సరం 2020లో తనకు వేతనం రాలేదంటూ కొంత సొమ్ము కావాలని ఆకాశ్ ఆమెను నమ్మించాడు. నిజమేనని నమ్మింది. ఎలాగు పెళ్లి చేసుకునేవాడే కదా అని ఆమె మనసు కరిగి కొంత నగదు జమా చేసింది. ఇలా గత నాలుగేళ్లుగా నమ్మించి ఆమె నుంచి రూ.2.5 కోట్లు తీసుకున్నాడు. అయితే 2024 నవంబరు నుంచి అతనికి డబ్బు ఇవ్వడం ఆపేసింది. అంతే అటు నుంచి అతని ఫోన్ ఆగిపోయింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించింది. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియా, మ్యాట్రిమోనియల్ వివరాలు నిజమని నమ్మి, గుడ్డిగా ఎదుటి వారు అడిగినంత డబ్బు ఇస్తే ఇలాగే నష్టపోవాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ముక్కుమొహం తెలియని వ్యక్తుల మాయమాటల్ని నమ్మి, డబ్బును ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సంఘటన ఎక్కడ జరిగింది?
ఈ మోసం బెంగళూరుకు చెందిన ఓ ఉపాధ్యాయురాలికి జరిగింది.
బాధితురాలు ఎవరు?
బెంగళూరులోని ఓ స్కూల్‌లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: https://epaper.vaartha.com/
Read Also: