📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

Cyber ​​crimes: ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మొద్దు..కొత్త మోసాలకు తెర

Author Icon By Saritha
Updated: January 21, 2026 • 5:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని కొత్త మోసాలకు తెరలేపుతున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోయింది. (Cyber ​​​​crimes) ఏ పని చేయాలన్నా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. దీన్నే సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. అమాయకులను, డిజిటల్ అక్షరాస్యత లేనివాళ్లను టార్గెట్ చేస్తున్నారు. వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలను కొల్లగొడుతూ అందిన కాడికి దోచేస్తున్నారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్త మార్గాల్లో మోసాలకు తెరలేపుతున్నారు.

Read Also: Bangladesh Crisis: భారత దౌత్యవేత్తల కుటుంబాల రప్పింపుపై కేంద్ర నిర్ణయం

Do not believe such calls at all.. the screen for new scams

కొత్త తరహా మోసాలు

ప్రస్తుతం మనుషుల ఎమోషన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇతరులు ఆపదలో ఉన్నారని, నిస్సహాయ స్థితిలో ఉన్నారని నమ్మబలుకుతూ అందిన కాడికి వసూలు చేస్తున్నారు. (Cyber ​​​​crimes) సైబర్ కేటుగాళ్లు ‘మీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పలానా రాష్ట్రంలో చిక్కుకుంది’ అని చెబుతారు. అంతేకాకుండా ఆమె బ్యాగులన్నీ చోరీకి గురయ్యాయని.. ఆమె దగ్గర డబ్బులు లేవని నమ్మిస్తారు. ఈ క్రమంలో తమని జర్నలిస్టులుగా, స్థానిక అధికారులుగా ప్రచారం చేసుకుంటారు. ఇక అవతలి వ్యక్తికి నమ్మకం కలిగించాక ఎమోషనల్‌గా ట్రిగ్గర్ చేస్తారు.

అందులో భాగంగా కొన్ని రోజులుగా పలానా మహిళ రైల్వేస్టేషన్‌లోనో, బస్ట్ స్టేషన్ ప్లాట్‌ఫారంపై ఉంటున్నారని చెబుతారు. తానే స్వయంగా భోజనాలు పెట్టించానని అంటారు. అయితే తాను సామాన్యుడినని ఆ మహిళను స్వగ్రామానికి పంపించాలంటే తన దగ్గర డబ్బులు లేవు అని చెబుతారు. మీరు మీ ప్రాంతంలోని అధికారులు, నాయకులకు చెప్పి ఆర్థికసాయం అందేలా చూడండి అంటూ నమ్మిస్తారు. ఇలాంటి కొత్త తరహా మోసాలు ఏపీలోని పలు జిల్లాల్లో నమోదవుతున్నాయి. వైఎస్సార్‌ కడప, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ జిల్లాల్లో కొంతమంది జిల్లా అధికారులు, విలేకర్లకు సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి ఇలా డబ్బులు అడుగుతున్నారట. ఇది నిజమేనని నమ్మి ఒకరిద్దరు డబ్బులు కూడా పంపించారని తెలుస్తోంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cyber Awareness cyber crimes digital scams Latest News in Telugu Online Fraud Online safety Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.