📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Cyber Crime: సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు

Author Icon By Aanusha
Updated: February 28, 2026 • 12:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Cyber Crime: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక అంతర్జాతీయ సైబర్ నేరగాడిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రసన్న కుమార్ అనే వ్యక్తి కంబోడియాలో ఉంటూ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు విదేశాల నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

500 సిమ్ కార్డులు సీజ్

ప్రసన్నకుమార్ ఒక మ్యాట్రిమోనియర్ వెబ్ సైట్‌లో యువతి పేరిట నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులను పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నాడు.అలాగే నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పలువురిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ మోసం చేశాడు. ఒక బాధితుడిని నిందితుడు రూ.11 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Cyber ​​Crime: Police arrest cyber criminal

మోసం చేయడానికి వందలాది అక్రమ సిమ్ కార్డులను సేకరించి ఫేక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద సుమారు 500 సిమ్ కార్డులు లభించాయి. అంతర్జాతీయ సైబర్ ముఠాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న పోలీసులు, విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Cambodia Cyber Gang Crypto Investment Scam cyber crime Hyderabad Matrimony Fraud Prasanna Kumar Arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.