📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Cyber Crime: ప్రమాదమంటూ రూ.35.23 లక్షలు దోచిన సైబర్‌ నేరగాళ్లు 

Author Icon By Sushmitha
Updated: November 6, 2025 • 5:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు దండుకుంటూ తమ రూట్‌ను మార్చారు. ముఖ్యంగా ఆడవారు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని(Hyderabad) వెంగళరావునగర్‌కు చెందిన ఒక వృద్ధురాలికి అపరిచితుడు వాట్సాప్ కాల్ చేసి, ఆమె కుమారుడు లండన్ ఎయిర్‌పోర్టులో ప్రమాదానికి గురయ్యాడని, ఐసీయూలో చేర్చానని నమ్మబలికాడు. కొడుకు చికిత్స కోసం డబ్బులు కావాలని కోరడంతో, ఆమె అది నిజమా అని ఆలోచించకుండా వెంటనే ₹35.23 లక్షలు పంపారు.

Read Also: Kamareddy: నేనే కలెక్టర్ ని.. ఇక్కడే నా పోస్టింగ్ చివరకి ఏమైంది?

Cyber Crime

మోసం వెలుగులోకి, కారణాలు

వృద్ధురాలు ఈ విషయాన్ని తన పెద్ద కుమారుడికి చెప్పడంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే మోసగాడిని సంప్రదించి, తన సోదరుడి ఫొటోలు పంపాలని కోరగా, ఆ మోసగాడు నిరాకరించి, ఛాటింగ్‌లో తన వివరాలు తొలగించాడు. ఈ నేరాలన్నీ మన సోషల్ మీడియా సమాచారం ఆధారంగానే జరుగుతున్నాయి. ‘మా అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు’, ‘జర్మనీలో టూర్‌కు వెళ్లాడు’ వంటి పోస్టులు పెట్టడం మోసాలకు కారణమవుతుంది. సైబర్ నేరగాళ్లు విమాన టిక్కెట్లు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల సమాచారాన్ని సేకరించి కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే యువత డేటాను ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసి కూడా ఈ మోసాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. నెల రోజుల్లో నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 20 నుంచి 25కు పైగా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

పోలీసుల సూచనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇలాంటి కేసుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్(Cyber Crime) ఎస్సై హిమారెడ్డి(SI Himareddy) సూచిస్తున్నారు. విదేశాల్లోని బంధువులు ఆపదలో ఉన్నారంటూ బెదిరించడాన్ని ‘ఫేక్ యాక్సిడెంట్స్, ఫ్యామిలీ డిస్ట్రెస్ స్కామ్స్‌’ అంటారని ఆమె తెలిపారు. ఎవరైనా ఈ తరహా ఫోన్‌కాల్స్ చేస్తే ఆందోళనకు గురై వెంటనే డబ్బులు పంపొద్దని సూచించారు. సదరు వ్యక్తులకు పోన్ చేసి అది నిజమా? లేదా? అని ధ్రువీకరించుకోవాలి. అవసరం అయితే వారి స్నేహితులు లేదా అధికారిక ఎంబసీ అధికారులతో ధ్రువీకరించుకున్న తర్వాతే ఆర్థిక నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Cyber Crime elderly victim. fake accident scam Google News in Telugu Latest News in Telugu Telugu News Today Vengal Rao Nagar WhatsApp fraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.