📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Crime: భర్తను ఎలా చంపాలో యూట్యూబ్లో చూసి ప్రియుడితో కలిసి భార్య హత్య

Author Icon By Ramya
Updated: August 6, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూట్యూబ్ లో ఎలా చంపాలో తెలుసుకుని ప్రియుడితో

చెవిలో గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్ లో చూసి

ప్రియుడిని ప్రోత్స హించింది

Crime: పచ్చని కాపురాల్లో అక్రమసంబంధాలు నిప్పులు పోస్తున్నాయి. భార్యాభర్తలు కలకాలం ఆనందంగా జీవించాల్సింది పోయి, క్షణికమైన సుఖాల కోసం వివాహేతర సంబంధాల కోసం తపిస్తున్నారు. దీంతో కట్టుకున్నవారిని, పిల్లల్ని గాలికొదిలేసి, ప్రేమించినవారితో వెళ్లిపోతున్నారు. ఇష్ట మైనవారితో వెళ్లిపోవడం తప్పు కాదు, కానీ తమ అక్రమసంబంధాలకు అడ్డుగా ఉంటున్నారని వారిని హతమార్చి, తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని ప్రయత్నిస్తు కటకటలపాలు అవుతున్నారు. తాజాగా ఓ వివాహిత తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని హతమార్చేందుకు ప్రణాళిక చేసింది. యూట్యూబ్ (Youtube) లో ఎలా చంపాలో తెలుసుకుని, ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది.

మద్యం తాగించి.. ఆపై హత్య

Crime: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేస్తూ తన భార్య రమాదేవి, ఇరవై ఏళ్ల వయసు దాటిన కొడుకు, కూతుర్లను పోషిస్తున్న సంపత్ (45) ఉన్నారు. భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండగా, తరచూ ఆమె వద్ద సర్వపిండి కోసం వచ్చి పరిచయం పెంచుకున్నాడు కర్రె రాజయ్య(50) అనే వ్యక్తి. అయితే భార్య రమాదేవి ఎలాగైనా తన భర్త సంపత్ అడ్డు తొలగించుకోవాలని యూట్యూబ్ లో చూసి పథకం వేసింది. చెవిలో గడ్డి మందు (Grass medicine) పోస్తే చనిపోతారని యూట్యూబ్ లో చూసి, ప్రియుడిని ప్రోత్స హించింది. పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఒవర్ వద్ద సంపత్తో కలిసి మద్యం సేవించిన రమాదేవి ప్రియుడు రాజయ్య అతని స్నేహితుడు శ్రీనివాస్ మద్యం మత్తులో తూలుతూ కింద పడి పోగానే చెవిలో గడ్డిమందు పోసి, అతను చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి సంపత్ చనిపోయాడని రాజయ్య తెలిపాడు. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు మరుసటి రోజు భర్త కనిపించడం లేదని పోలీసులకు రమాదేవి ఫిర్యాదు చేసింది. అనంతరం ఆగస్టు 1వ తేదీన భర్త మృతదేహం దొరికిందని పోలీసులకు తెలిపిన రమాదేవి, మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని అడగడంతో రమాదేవిపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె కాల్టా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు రమాదేవి, రాజయ్య, మరొకవ్యక్తి శ్రీనివాసులు అంగీకరించారు.

రమాదేవి తన భర్తను చంపేందుకు ఏ విధంగా ప్రణాళిక వేసింది?

యూట్యూబ్‌లో హత్య చేసే మార్గాలు చూసి, మద్యం తాగించిన తర్వాత చెవిలో గడ్డి మందు పోసి ప్రియుడితో కలిసి భర్తను చంపింది.

పోలీసులు హత్యను ఎలా గుర్తించారు?

రమాదేవి నడతపై అనుమానం కలిగి కాల్‌ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఆధారంగా విచారించగా నిందితులు హత్యను ఒప్పుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tg-pensions-chayutha-benefits-to-deceased-persons/telangana/526681/

Breaking News Crime domestic-dispute Karimnagar latest news Murder Telugu News youtube-influence

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.