📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Crime: మగ శిశువుకు జన్మనిచ్చిన పదో తరగతి విద్యార్థిని..ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చట్టాలు కఠినతరం అవుతున్నా, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలు లైంగిక దాడులకు గురవుతున్నారు. అలాంటి ఘోర ఘటన నంద్యాల జిల్లా (Nandyal District) బనగానపల్లె మండలంలోని కైప గ్రామంలో వెలుగులోకి వచ్చింది.పదో తరగతి చదువుతున్న కేవలం 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మనోహర్ (21) దారుణానికి పాల్పడ్డాడు. రోజు ఇంటి దగ్గర తిరుగుతున్న బాలికను మాయమాటలు చెప్పి తనవైపు తిప్పుకున్నాడు. మొదట స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత తన మాటలతో మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకువెళ్లి, ఏడాది కాలంగా నిరంతరం అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు.

Crime

యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

అయితే కూతురుకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి (Banaganapalle Government Hospital) కి తరలించారు. డాక్టర్లు బాలికకు వైద్య పరీక్షలు చేసి, గర్భవతి అని నిర్ధారించారు. తొమ్మిది నెలల తర్వాత బాలికకు డెలివరి చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు నందివర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సంఘటన మరోసారి సమాజానికి గట్టిగా హెచ్చరికగా మారింది. చట్టాలు ఎంత కఠినమైనా, మనస్తత్వం మారకపోతే మహిళలపై, పిల్లలపై అఘాయిత్యాలు ఆగవు. తల్లిదండ్రులు పిల్లలతో మరింతగా సమయం గడిపి, వారికి భద్రతా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/khammam-son-attacks-father-for-bike/telangana/531481/

banaganapalle incidents Breaking News Child Abuse child rights violation latest news minor girl pregnancy nandyal crime news rape case india sexual assault on minors Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.